వందేళ్ళ సినిమా పండుగ రెండొవరోజు కార్యక్రమాలలో తెలుగు సనీ ప్రముఖుల వార్ బహిరంగంగా కనిపించింది. తెలుగు సినిమా విప్లవ నటుడు ఆర్.నారాయణ మూర్తి చెన్నైలో కూడా కలకలం సృష్టించాడు. వందేళ్ళ సినిమా వేడుకలు జరుగుతున్న తీరును నిరసిస్తూ నిన్న ఆదివారం రాత్రి వేదికపైకి ఎక్కీ, డాన్సులు వేస్తున్న కళాకారులను కాదని మైక్ అందుకున్నాడు. అంతేకాదు తాను ప్రసంగించాలని అందరూ పక్కకు తప్పుకోమని కోరాడు. ఆయన ఉద్వేగాన్ని చూసి అందరు ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. ఏం జరుగుతుందో అర్థం కాక ఒకరి మొహం మరొకరు చూసుకున్నారు. నారాయణమూర్తి తన సహజ సిద్దమైన ఆవేసంతో తెలుగువారు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమ వేధికకు రఘపతి వెంకయ్యనాయుడు పేరు పెట్టకపోవడం పై తీవ్రంగా విమర్శిస్తూ వందేళ్ళ సినిమా పండుగ అంటే రికార్డింగ్ డాన్స్ లా అంటూ మండి పడ్డారు.
అంతేకాదు దాసరి, రాఘవేంద్రరావు, విశ్వనాద్ లాంటి వాళ్ళకు సత్కరించరా అంటు నిప్పులు చెరిగారు. ఆయన ఉపన్యాసం ఇలా కొనసాగుతూ ఉండగానే ఆయన ఉద్వేగాన్ని చూసి ప్రముఖ నిర్మాత కళ్యాణ్ ఇతర ప్రముఖులు ఆయన వద్ద నుండి మైక్ లాగేసుకోబోయారు. ఈ హడావిడిలో ఓ పత్రికకు చెందిన ఫోటోగ్రాఫర్ కిందపడిపోయాడు. దీనితో భంగ పడ్డ నారాయణ మూర్తి మరింత రెచ్చిపోయారు. అప్పటిదాకా ఫుల్లు జోష్ మీద ఉన్న ప్రముఖులు ఒక్కసారి డీలాపడిపోయినట్టు కనిపించారు. దీనికి మంత్రి డి.కె. అరుణ చేసిన వ్యాఖ్యలు మరింత గందరగోళానికి తావు ఇచ్చాయి.
మంత్రి అరుణ మాట్లాడుతూ తెలుగు సినిమా సాంకేతిక పరంగా అభివృద్ధి చెందినా ప్రస్తుతం వస్తున్న తెలుగు సినిమాలు సంసృతీ సాంప్రదాయాలకు తిలోదకాలు ఇస్తూ నటీమణుల అర్ధనగ్న వస్త్రధారణతో కుటుంబ సభ్యులంతా కూర్చుని చూడలేని సినిమాలు రావడం బాధాకరం అని ఆమె చేసిన వ్యాఖ్యలు మన తెలుగు సినిమా గురించి మన తెలుగు మహిళ పరాయి గడ్డ పై ఇలా వ్యాఖ్యా నించడం ఏమిటీ అంటూ చాలామంది అనుకోవడం వినిపించింది. ఎదిఎమైనా వందేళ్ళ సినిమా పండుగలో మన తెలుగు సినిమా వార్ బహిరంగంగా కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచింది....
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి