తెలుగు లో వస్తున్న బిగ్ బాస్ 3 విన్నర్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ నిలిచాడు. అయితే చివరి వరకు ఇంటి సభ్యులతో గట్టి పోటీ ఇస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ తో ముందుకు సాగిన శ్రీముఖి చివరి వరకు విన్నర్ అంటూ అటు ఇంటి సభ్యులు..ఇటు మీడియా, ఫ్యాన్స్ తెగ హల్ చల్ చేశారు. అంతేందుకు మొన్న కప్పుతో శ్రీముఖి, నాగార్జునను హగ్ చేసుకొని ఉన్న ఫోటో వైరల్ అయ్యింది.  నిజంగానే బిగ్ బాస్ లో ఫోటోలు సర్వసాధారణంగా..ఈ నేపథ్యంలో బిగ్ బాస్ 3 విన్నర్ ఈసారి అమ్మాయి కొట్టేసింది..ఎంతో గర్వకారణంగా ఉందని సోషల్ మీడియాలో తెగ కామెంట్స్ వచ్చాయి. 


అయితే రింగ్ రివర్స్ అయ్యింది.. కోటి ఆశలు పెట్టుకున్న శ్రీముఖి రన్నరప్ గానే ఉండాల్సి వచ్చింది.  రెండో స్థానంలో నిలబడాల్సి వచ్చింది. బిగ్ బాస్-3 గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ లో ముగ్గురు కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యేంత వరకు జరిగిందంతా ఒకెత్తయితే, చివర్లో మెగాస్టార్ చిరంజీవి ఎంట్రీ ఇవ్వడం మరో ఎత్తు. అప్పటి వరకు ముద్దుగమ్ముల డ్యాన్స్ లతో హోరెత్తించిన బిగ్ బాస్ చిరు రాకతో ఆ సందడి మరోలా మారిపోయింది.  బిగ్ బాస్, నాగార్జున, ఇంటి సభ్యులను తెగ పొగిడేశాడు చిరంజీవి.

అంతే కాదు బిగ్ బాస్ గురించి అనర్గలంగా మాట్లాడటంతో నాగార్జున్ విస్మయం చెందారు..నిజంగా బిగ్ బాస్ గురించి ఇంత ఉందా నాకు తెలియదని అన్నారు.  రు తనదైన శైలిలో వినోదం పండించారు. ఎప్పుడూ కోపగించుకోని నాగ్ బిగ్ బాస్-3 సందర్భంగా కోపం తెచ్చుకుంటున్నాడని విన్నానంటూ వ్యాఖ్యానించారు. అంతేకాదు, కోపం కూకట్ పల్లిలో ఉంటే నాగార్జున నార్కెట్ పల్లిలో ఉంటారు అంటూ చమత్కరించారు. మొత్తానికి  బిగ్ బాస్ మూడో సీజన్ టైటిల్ ను  రాహుల్ సిప్లిగంజ్ గెలుచుకున్నాడు.

మెగాస్టార్ చిరంజీవి సమక్షంలో రాహుల్ విజేతగా నిలిచినట్టు హోస్ట్ నాగార్జున ప్రకటించారు.  నాగ్ సింగర్ రాహుల్ చేతిని పైకెత్తడంతో హర్షధ్వనాలు మిన్నంటాయి. విజేత రాహుల్ భావోద్వేగాలు ఆపుకోలేక కన్నీరు పెట్టుకొని మాట్లాడటం అందరినీ మనసు కలచి వేసింది. ఇంటి సభ్యుల మనసు ఏదైనా నొప్పించి ఉంటే పెద్ద మనసుతో క్షమించాలని అన్నాడు.  తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ కృతజ్ఞతలు అంటూ గట్టిగా అరిచేశాడు. అయితే చివరి నిమిషంలో శ్రీముఖి ఫ్యాన్స్ చేసిన హడావుడి..రచ్చ ఆమె కు ఓట్లు తగ్గించేలా చేశాయని కొందరు అనడం విశేషం. 

మరింత సమాచారం తెలుసుకోండి: