సినిమా అంటేనే రంగు రంగులతో భ్రాంతి కలిగించే కలర్‌ఫుల్ ప్రపంచం. ఇక్కడ పైకి కనిపించినంతగా తెరవెనుక అందరి జీవితాలు మెరిసిపోవు. ఒక్కోసారి ఓడలు బండ్లవుతాయి. బండ్లు ఓడలవుతాయి. కొందరి సినిమా స్టార్ల వెనుక ఉన్న కష్టాలు కన్నీళ్లు తెప్పిస్తుంటాయి. ఈ రంగంలో స్టార్ హీరోలుగా వెలిగి చివరి దశలో అత్యంత దీన స్థితిలో గడిపిన వారు ఉన్నారు.

 

 

కోట్లు సంపాదించి అంతిమ దశలో మందులు కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేని పరిస్థితికి చేరుకున్న నటీ నటులు ఉన్నారు. ఇలాంటి వారిలో అలనాటి బాలీవుడ్ నటి, సల్మాన్ ఖాన్ హీరోయిన్ పూజా దడ్వాల్ ఒకరు. తీవ్ర అనారోగ్యంతో అత్యంత దీన స్థితి నుండి బయట పడ్డ ఈవిడ సినిమాల్లేక టిఫిన్ సెంటర్ నడుపుకుంటూ బతికేస్తున్నారు. కొన్ని నెలల క్రితం క్షయ వ్యాధితో బాధపడుతూ డబ్బుల్లేక దిక్కులేని స్థితిలో అనాధగా హాస్పిటల్‌లో ఉన్న విషయం  వైరల్ అయిన సంగతి తెలిసిందే.

 

 

తన పరిస్థితిని వివరిస్తూ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేయడంలో అది అందరికీ చేరువైంది. అప్పుడు వెంటనే స్పందించిన సల్మాన్ ఆమె చికిత్సకు ఆర్థిక సాయం చేశారు. ఇప్పుడు ఆమె కోలుకున్నారు. అయితే సినిమాల్లో అవకాశాలు రాకపోవడంతో బతుకు తెరువు కోసం ఓ చిన్న టిఫిన్ సెంటర్ నడుపుకుంటున్నారు. ఇకపోతే 1995లో వచ్చిన ‘వీర్‌ఘటి’ సినిమాలో బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్‌కు జోడీగా నటించడంతో పాటుగా ‘హిందుస్థాన్’, ‘సింధూర్ కీ సౌగంధ్’, ‘మేడమ్ నెం 1’ తదితర సినిమాల్లో పూజా నటించారు.

 

 

ఇక పూజా హస్పిటల్ నుండి కోలుకున్నాక చిత్ర పరిశ్రమలోని తన స్నేహితులను కలిసి పని కావాలని అడుగినప్పుడు మాటయిచ్చిన వారు ఇప్పటివరకు ఏ సినిమాలోనూ అవకాశం ఇవ్వలేదు. నా దగ్గర డబ్బులేదు. కానీ కాన్ఫిడెన్స్ ఉంది. పొట్ట నింపుకోవడానికి ఏం చేయాలో తెలీలేదు. అప్పుడు నా స్నేహితుడైన డైరెక్టర్ రాజేంద్ర సింగ్ టిఫిన్ సెంటర్ పెట్టుకోమని సలహా ఇచ్చాడు.

 

 

అందుకు కావాల్సిన సామాన్లను కూడా అతనే కొనిచ్చాడు. నాకు దేవుడిపై నమ్మకం ఉంది. ఏదో ఒక రోజు నాకు సినిమాల్లో అవకాశం వస్తుంది. నా చికిత్స కోసం సాయం చేసిన సల్మాన్‌ను ఓసారి కలిసి మనసారా ధన్యవాదాలు చెప్పుకోవాలని ఉంది. అతను నాకు దేవుడితో సమానం’ అని ఈ సందర్భంగా వెల్లడించారు. ఇదండీ సినీ వెలుగుల్లో కనబడని చీకటి బ్రతుకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: