మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని రీతు వర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు .  ఈ నటి జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందిన "బాద్ షా" సినిమాలో కాజల్ కి చెల్లెలు పాత్రలో నటించి చిన్న వయ సులోనే తన నటనతో ప్రేక్షకులను అలరించింది. అలా చిన్నతనం లోనే తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత విజయ్ దేవరకొండ హీరోగా తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన పెళ్లి చూపులు మూవీ తో హీరోయిన్ గా తన కెరీర్ ను ప్రారంభించింది. ఈ మూవీ మంచి విజయం సాధించడం , ఇందులో ఈమె తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ సినిమా తర్వాత నుండి ఈమెకు వరుసగా తెలుగులో అవకాశాలు దక్కుతున్నాయి. 

ఈమె కేవలం తెలుగు సినిమాల్లో మాత్రమే కాకుండా ఇప్పటికే అనేక ఇతర భాష సినిమాల్లో కూడా నటించి ఇండియా వ్యాప్తంగా మంచి గుర్తింపును సంపాదించుకుంది. కొంత కాలం క్రితం ఈమె విశాల్ హీరో గా అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో రూపొందిన మార్క్ ఆంటోనీ అనే తమిళ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ సూపర్ సక్సెస్ అయ్యింది. ఈ సినిమాతో ఈమెకు తమిళ ఇండస్ట్రీ లో కూడా మంచి గుర్తింపు లభించింది.

సినిమాల్లో భారీ స్థాయిలో అందాలను ఆరబోయకుండా డీసెంట్ గా తన స్కిన్ షో తో ఆకట్టుకుంటున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అదే స్థాయిలో తన అందాలను ఆరబోస్తోంది. అందులో భాగంగా తాజాగా ఈ నటి అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న బిగుతు వస్త్రాలను ధరించి హాట్ యాంగిల్స్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం అవి సూపర్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

rv