మాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన హీరో లలో ఒకరు అయినటు వంటి మమ్ముట్టి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు . మమ్ముట్టి ఈ మధ్యకాలంలో వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు . అందులో భాగంగా ఈయన నటించిన చాలా సినిమాలు రీసెంట్ టైమ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ లను అందుకున్నాయి .  ప్రస్తుతం మముట్టి "టర్బో" అనే స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైలర్ సినిమాలో హీరో గా నటిస్తున్నాడు . ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది . మరి కొన్ని రోజుల్లోనే ఈ సినిమాకు సంబంధించి న టోటల్ షూటింగ్ పూర్తి కాబోతున్నట్లు సమాచారం. 

కొన్ని రోజుల క్రితం ఈ మూవీ బృందం వారు ఈ సినిమాని ఈ సంవత్సరం జూన్ 13 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ఇకపోతే తాజాగా వారు ఈ సినిమా విడుదల తేదీని మార్చారు. ఈ మూవీ ని ఈ సంవత్సరం మే 23వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్లు విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ అవుతుంది. ఇక ఈ మూవీ ముందు చెప్పిన తేదీ కంటే ముందే థియేటర్ లలోకి రాబోతుంది.

మరి ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. వైషాక్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో టాలీవుడ్ నటుడు సునీల్ కూడా ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. వరుస విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్న మమ్ముట్టి హీరోగా రూపొందుతున్న సినిమా కావడంతో ఈ మూవీ పై మలయాళ సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: