కెరీర్ మొదటి నుంచి కమర్షియల్ హీరో అన్న ఇమేజ్ కోసం  ఆరాటపడకుండా, కమర్షియల్ సినిమాల జోలికి వెళ్ళకుండా విభిన్నమైన కథాంశం ఉన్న సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ హీరో శర్వానంద్. మంచి కథలని ఎంచుకుంటూ మినిమం గ్యారెంటీ హీరోగా పేరు సంపాదించుకున్నాడు. ప్రేక్షకులు ప్రశాంతంగా కూర్చొని చూసే సినిమాలతో శర్వానంద్ ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యాడు. ఫ్యామిలీ హీరో అన్న ట్యాగ్ ని సంపాదించుకున్నాడు. అంతేకాదు శర్వా సినిమాకి ఎక్కువగా ఫ్యామిలీ ఆడియన్స్ ఉండటం విశేషం. శతమానం భవతి సినిమాతో మంచి హిట్ ని తన ఖాతాలో వేసుకున్న శర్వా ఆ తర్వాత మళ్ళీ ఆ స్థాయి సక్సస్ ని మాత్రం అందుకోలేకపోయాడు. సాయి పల్లవి హీరోయిన్ గా పడి పడి లేచే మనసు, అలాగే కళ్యాణి ప్రియదర్శిణి హీరోయిన్ గా వచ్చిన రణ రంగం సినిమాలు రెండు కూడా శర్వాకి నిరాశని మిగిల్చాయి. 

 

ఇక త్వరలో 'జాను' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న శర్వా తమిళంలో సెన్షేషనల్ సక్సెస్ ని అందుకున్న 96 సినిమాకి అఫీషియల్ రీమేక్ గా తెలుగులో దిల్ రాజు నిర్మిస్తున్నారు. సమంత హీరోయిన్ గా నటిస్తున్న జాను విడుదలకు సిద్దం అవుతుంది. ఇంతలోనే శర్వానంద్ కొత్త సినిమాకి 'శ్రీకారం' చుట్టాడు. అంతేకాదు ఈ సినిమా నుంచి వచ్చిన 'శ్రీకారం' ఫస్ట్ లుక్ చాలా చక్కగా ఉంది అంటూ కామెంట్స్ వచ్చాయి. పల్లెటూరి కథ కావడం తో మరోసారి శతమానం భవతి వంటి సినిమాతో వస్తున్నాడని అందరూ భావిస్తున్నారు.

 

ఇక ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్ లో రామ్ ఆచంట, గోపీ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తుండగా కిషోర్ బి దర్శకత్వం వహిస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ పూర్తి చేసి మే లేదా జూన్ ఆరంభంలో విడుదల చేసేలా చిత్ర బృందం సన్నాహాలు చేశారు. అయితే కరోనా కారణంగా ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ కి బ్రేక్ పడింది. అంతేకాదు ప్రస్తుతం రిలీజ్ అవ్వాల్సిన సినిమాలే మళ్ళీ కొత్త రిలీజ్ డేట్స్ కోసం పోటీ పడే పరిస్థితి నెలకొంది. ఇలాంటి నేపథ్యంలో శర్వానంద్ శ్రీకారం ఎప్పుడు షూటింగ్ కంప్లీటవ్వాలి ..ఎప్పుడు రిలీజ్ కి రావాలి. పాపం ఇలాంటి పరిస్థితులు వస్తాయని శర్వానంద్ ఊహించలేదు.  

మరింత సమాచారం తెలుసుకోండి: