తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు వారసత్వపు నటులు వస్తున్న విషయం తెలిసిందే. కొంత మందికి ఎంత టాలెంట్ ఉన్నా అదృష్టం కలిసి రాక ఇండస్ట్రీలో రాణించలేరు.  ఒక్కొసారి అదృష్టంతో వరుస ఛాన్సులతో బిజీ అయిన నటులు కూడా ఉన్నారు.  ప్రపంచ వ్యాప్తంగా ఉర్రూతలూగించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘బాహుబలి’.  దర్శకధీరుడు రాజమౌళి ఈ చిత్రం తెరకెక్కించారు.  ఈ మూవీలో బాహుబలి గా ప్రభాస్, భల్లాళదేవుడిగా రాణా, శివగామిగా రమ్యకృష్ణకు ఎంత పేరు వచ్చిందో.. ఆదే స్థాయిలో కాలకేయ భయంకరమైన రూపంతో అబ్బుర పరిచిన నటుడు ప్రభాకర్ కి అంతే పేరు వచ్చింది. అసలు బాహుబలి చిత్రంలో క్లయిమాక్స్ లో కాలకేయ సీన్లు సెన్సేషన్ గా ఉంటాయి.  కిల్కి భాషతో సాగే ఈ ఎపిసోడ్ చిత్రానికి హైలెట్ గా నిలిచింది.  

 

ఈ చిత్రంలో నటించిన ప్రభాకర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను ఇండస్ట్రీకి అనుకోకుండా వచ్చానని... బేసిగ్ గా నాకు నటనలో ఓనమాలు కూడా తెలియవని అన్నారు.  నా పర్సనాలిటీ బాగుంటుందని... నువు పోలీస్ గా బాగా పనికి వస్తావని ఊళ్లో అనేవారు. అందుకే  ఒక వ్యక్తి రైల్వేలో జాబ్ ఇప్పిస్తానని ఆశపెడితే మహబూబ్ నగర్ నుంచి హైదరాబాద్ వచ్చాను.  అతను మోసం చేయడంతో చిన్న చిన్న పనులు చేస్తూ రోజులు గడిపాను. ఒకరోజు మహేష్ బాబు నటించిన  'అతిథి' షూటింగు చూడటానికి వెళితే, ఆ దర్శకుడు నన్ను చూసి చిన్నవేషం ఒకటి ఇచ్చాడు.  రాజమౌళి గారు 'మర్యాద రామన్న' సినిమాలో నాకు అవకాశం ఇచ్చారు.  

 

ఆ సమయంలో నాకు డైలాగ్స్, హావభావాలు ఎలా పలకాలో తెలియదు.. దాంతో ఆయనే సొంత ఖర్చుతో నాకు శిక్షణ ఇప్పించారు. 'మర్యాద రామన్న' సినిమా నాకు  గుర్తింపు తీసుకు రావడమే కాదు, నా అప్పులన్నీ తీర్చేసింది.  ఇక బాహుబలి లాంటి గొప్ప చిత్రంలోనాకు కాలకేయ పాత్ర సృష్టించి నా జీవితాన్నే మార్చారు. అప్పటి నుంచి నేను వెనుదిరిగి చూసుకోలేదు. రాజమౌళి గారు నన్ను గుర్తించి అవకాశం ఇవ్వకపోతే, నా పరిస్థితి చాలా దారుణంగా ఉండేది.. ఆయన నాకు దేవుడి లాంటి వారు అన్నారు ప్రభాకర్. 

మరింత సమాచారం తెలుసుకోండి: