కెరీర్ లో ట్రోల్స్ విమర్శలు లేని హీరోలు ఎవరూ ఉండరు. ఎంత పెద్ద స్టార్ అయినా.. ఎప్పుడో ఒకప్పుడు విమర్శలు ఫేస్ చేస్తూనే ఉంటాడు. అయితే ఒక హీరోపై కక్ష గట్టి విమర్శలు చేసే వాళ్లు పెద్దగా కనిపించరు. అయితే కొంతమంది మాత్రం పనిగట్టుకొని మరీ సల్మాన్ ఖాన్ పై విమర్శలు చేస్తున్నారు. పర్సనల్ గా టార్గెట్ చేస్తున్నారు.
సల్మాన్ ఖాన్ కు క్రేజీ ఫాలోయింగ్ ఉంది. మిగతా హీరోల అభిమానులు కూడా సల్మాన్ ఛారిటీకి ఇంప్రెస్ అవుతుంటారు. లాక్ డౌన్ లో తన ఫామ్ హౌస్ పాన్వెల్ ను సేవా కేంద్రంగా మార్చుకొని వందల మందికి సాయం చేశాడు. ఇండస్ట్రీపై ఆధారపడిన కార్మికులకు అకౌంట్స్ లో డబ్బు జమ చేశాడు. ఫామ్ హౌస్ చుట్టుపక్కల ఉన్న ఊర్లలో నిత్యావసరాలు పంచాడు. అలాంటి భాయిజాన్ పై నెట్ వరల్డ్ లో బోల్డన్ని విమర్శలు వస్తున్నాయి.
సల్మాన్ ఖాన్ రీసెంట్ గా తన ఫామ్ హౌస్ లో వ్యవసాయం చేస్తున్న ఫోటోలను పోస్ట్ చేశాడు. రెస్పెక్ట్ టు ఆల్ ది ఫార్మర్స్ అనే ట్యాగ్ లైన్ తో బురదతో ఉన్న ఫోటోని షేర్ చేశాడు. దీనిపైనే బోల్డన్ని విమర్శలు వస్తున్నాయి. సల్మాన్ ఇక్కడ కూడా యాక్టింగ్ ని వదిలేయవా.. వ్యవసాయం చేసేవాళ్లకు ఇంత బురద అంటుతుందా అని ట్రోల్ చేస్తున్నారు. అయితే ఈ ట్రోల్స్ వెనుక ఒక ప్లాన్ ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ చనిపోయాక బాలీవుడ్ ఫ్యామిలీస్ పై విమర్శలు ఎక్కువయ్యాయి. సల్మాన్ ఖాన్ తండ్రి సలీమ్ ఖాన్ అండతో సినిమాల్లోకి వచ్చాడు. సల్మాన్ తమ్ముళ్లు అర్బాజ్ ఖాన్, సోహైల్ ఖాన్, బావమరిది ఆయుష్ శర్మ కూడా ఇండస్ట్రీలో ఉన్నాడు. దీంతో సల్మాన్ నెపోటిజాన్ని ఎంకరేజ్ చేస్తున్నాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి