జబర్దస్త్ టీం లీడర్స్ అనగానే ముందుగా గుర్తొచ్చే పేరు హైపర్ ఆది. అంతగా క్లిక్ అయ్యారు ఆది. మొదట్లో చిన్న చిన్న పాత్రలతో జబర్దస్త్ లో అడుగు పెట్టాడు. తర్వాత  అతని టాలెంట్ చూసి టీం లీడర్ గా ప్రమోట్ చేసింది జబర్దస్త్ యాజమాన్యం. అతను వేసే పంచ్ లకు స్టేజ్ షేక్ అవ్వాల్సిందే....టీవీ ముందు ఉన్న ప్రేక్షకులు పొట్టచెక్కలయ్యేలా నవ్వాల్సిందే... అంతలా కామెడీ పండిస్తాడు ఆది ...



అతనే కాదు ఆయన టీమ్ మెంబర్స్ లో కూడా అంతే జోష్ ఉండేలా చూసుకుంటాడు.. విభిన్న కాన్సెప్ట్ లతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక అనసూయపై వేసే పంచ్ లతో, ఆమెతో వేసే స్టెప్పులతో ఇంకాస్త క్రేజ్ పెంచుకున్నాడు... అసలు ఆది అంటేనే కామెడీ టైమింగ్ అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు జనం... ఇటు సినిమాలలోనూ అవకాశాన్ని అందిపుచ్చుకుంటున్నాడు. యూట్యూబ్ లోనూ తన ఫాలోవర్స్ ల సంఖ్యను బాగానే పెంచుకున్నాడు ఆది. పవర్ఫుల్ పంచ్ లతో స్టార్ కమెడియన్ గా ఎదిగిన ఆది పెళ్లంటే అందరికీ తెలుసుకోవాలని ఆత్రుత గా ఉంటుంది.. గతంలో ఆయన రహస్యంగా పెళ్లి చేసుకున్నాడంటూ చాలా రూమర్లు వచ్చాయి.




 అయితే ఇప్పుడు తాజాగా తన పెళ్లి వచ్చే ఏడాది అంటూ షాక్ ఇచ్చాడు ఆది. తన తల్లిదండ్రులు చూసిన అమ్మాయిని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నా..! అంటూ క్లారిటీ ఇచ్చాడు. ఈ మధ్యన హైపర్ ఆదికి ఒక అమ్మాయి ఒంగోలు ఫంక్షన్లో కలిసి చనువుగా మాట్లాడడం, సెల్ఫీలు దిగడం, వాళ్ళ పేరెంట్స్ తో తన ముందే వీడియో కాల్ చేసి మాట్లాడటం ఇలాంటివి చేసి హైపర్ ఆదికి మరింత దగ్గర అయిందంట.    ఆది చూడడానికి అలా  ఉంటాడు  కానీ,  ఏమేమో చేస్తున్నాడు. ఇది పూర్తిగా మా అమ్మా నాన్నల ఇష్టం మీద జరుగుతోంది, వారికి నచ్చింది కనకే ఆ అమ్మాయిని పెళ్ళి చేసుకోవడానికి ఫిక్స్ అయ్యాను అంటూ చెప్పుకొచ్చాడు ఆది.. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వార్త విన్న తన అభిమానులు పండగ చేసుకుంటున్నారు... త్వరలోనే తమ ప్రియతమ హాస్యనటుడు పెళ్లి కొడుకు కాబోతున్నాడు అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు... అయితే హైపర్ ఆది ని పెళ్లి  చేసుకునే ఆ అమ్మాయి పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: