ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న మూవీ ‘ఆర్ ఆర్ ఆర్’ రౌద్రం రణం రుధిరం అనే ట్యాగ్ తో విడుదల కాబోతున్న ఈ మూవీ విడుదల తరువాత సృష్టించబోయే కలక్షన్స్ రికార్డులతో తిరిగి తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి పూర్వవైభవం వస్తుందని భావిస్తున్నారు.


చరణ్ జూనియర్ కాంబినేషన్ లో నిర్మాణం జరుపుకుంటున్న ఈ మూవీకి మరింత క్రేజ్ తీసుకు రావడానికి ఈ మూవీ కోసం చిరంజీవిని కూడ రంగంలోకి దింపే ఆలోచనలలో రాజమౌళి ఉన్నాడని ఒక ప్రముఖ దినపత్రిక ఒక ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది. ఆ పత్రిక కథనం ప్రకారం ఈ మూవీలోని ఎన్టీఆర్ రామ్ చరణ్ పాత్రలను వెండితెర పై ఈ మూవీ చూసే ప్రేక్షకులకు చిరంజీవి తన వాయస్ ఓవర్ ద్వారా పరిచయం చేస్తాడని తెలుస్తోంది.


ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రను రామ్ చరణ్ వాయస్ ఓవర్ తో చరణ్ నటిస్తున్న అల్లూరి సీతారామరాజు పాత్రను జూనియర్ వాయస్ ఓవర్ తో విడుదల చేసిన టీజర్లకు వచ్చిన అనూహ్య స్పందనను చూసిన రాజమౌళికి ఫైనల్ గా ఈ మూవీని ధియేటర్లలో చూసే ప్రేక్షకులు చరణ్ జూనియర్ పాత్రలను చిరంజీవి వాయస్ ఓవర్ తో పరిచయం చేస్తే ఈ మూవీకి మరింత క్రేజ్ వస్తుందని రాజమౌళికి ఆలోచన రావడంతో ఇదే విషయాన్ని జక్కన్న చిరంజీవిని అడగడం ఆయన ఒకే చేయడం జరిగిపోయింది అని తెలుస్తోంది.


ఈ మూవీకి సంబంధించిన హిందీ వెర్షన్ కు అమీర్ ఖాన్ వాయస్ ఓవర్ ఇస్తాడని తమిళ వెర్షన్ కు సూర్య వాయస్ ఓవర్ ఇస్తే మళయాళ వెర్షన్ కు మోహన్ లాల్ వాయస్ ఓవర్ ఇచ్చే ఆస్కారం ఉంది అన్న వార్తలు వస్తున్నాయి. గతంలో చిరంజీవి భారీ బడ్జెట్ మూవీ ‘సైరా’ కు ఇదే విధంగా క్రేజ్ తీసుకు రావడానికి ఆ మూవీకి పవన్ కళ్యాణ్ తో వాయస్ ఓవర్ ఇప్పించారు. అయితే చిరంజీవి నటన పవన్ వాయస్ ఓవర్ ఆ మూవీని ఏమాత్రం రక్షించ లేకపోయాయి. మరి ఇప్పుడు చిరంజీవి వాయస్ ఓవర్ ఎంతవరకు ‘ఆర్ ఆర్ ఆర్’ రికార్డులకు సహకరిస్తుందో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: