గుణశేఖర్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన బ్లాక్ బాస్టర్ మూవీ ఒక్కడు. 2003వ సంవత్సరంలో విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్లను రాబట్టింది. మహేష్ బాబు, భూమిక, ప్రకాష్ రాజ్  ల నటన, గుణశేఖర్ టేకింగ్ ఈ సినిమాను అద్భుతంగా నిలబెట్టాయి.. ఈ సినిమా విడుదలైన మొదటి రోజే కుర్రకారును బాగా ఆకట్టుకుంది. మరీ ముఖ్యంగా ఈ సినిమాలో వచ్చిన 9848032919 నెంబర్ అత్యంత పాపులర్ ను సాధించింది. అయితే ఆ ఫోన్ నెంబర్ ఎవరిదో ఇప్పుడు తెలుసుకుందాం..



ఒక్కడు సినిమా లో చార్మినార్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే సన్నివేశాలు, కర్నూల్ కోట చుట్టూ తిరిగే సన్నివేశాలు ఈ చిత్రానికి హైలెట్ గా నిలిచాయి.  పాస్ పోర్ట్ ఆఫీసర్ గా ధర్మవరపు సుబ్రహ్మణ్యం ను, ఆటపట్టించే సీన్ అయితే ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది.. ఈ సినిమాలో ధర్మవరపు  సుబ్రహ్మణ్యం 9848032919  తన ఈ సెల్ ఫోన్ నెంబర్ ను  తన ప్రేయసి కి  చెబుతారు..


అప్పటికే భూమిక కు పాస్ పోర్ట్ కావాలని ఆ ఆఫీసు కు వచ్చిన మహేష్ బాబు, ఆ నంబర్ ను నోట్ చేసుకుంటాడు. దాంతో ఆ నెంబర్ కు ఫోన్ చేస్తూ ఉంటారు మహేష్ బాబు అలాగే అతని బ్యాచ్. ఆ బ్యాచ్ చేసే అల్లరికి కోపం వచ్చిన ధర్మవరపు  సుబ్రహ్మణ్యం  ఆ మొబైల్ ను నేలకేసి కొడతాడు. ఇంతలో మళ్లీ మహేష్ బాబు అక్కడికి వచ్చి పాస్ పోర్ట్ ను అడిగి తీసుకుంటాడు. ఈ సీన్ మీ అందరికీ గుర్తే ఉంటుంది కదా..! ఇంతకూ ధర్మవరపు సుబ్రహ్మణ్యం చెప్పిన ఈ మొబైల్ నెంబర్ ఎవరిది అనే కదా మీ సందేహం..? ఇంకెవరిది..? ఆ చిత్ర నిర్మాత అయిన ఎమ్మెస్ రాజు ది.


ఈ చిత్రంలో ఆ సీన్ తీసేటప్పుడు ఎవరి నెంబరు పెడదామా అని అనుకుంటూ ఉండగా.. ఇంకెవరిది పెడతారు..నిర్మాత నెంబర్ అయితే బాగా సెట్ అవుతుంది అని ఆ చిత్రం యూనిట్ లో ఒకరు సలహా ఇచ్చారట. అలా ఆ సన్నివేశంలో నిర్మాత ఎమ్మెస్ రాజు మొబైల్ నెంబర్ ను ఉపయోగించారు.. ఇక ఆ సినిమా విడుదలైన తరువాత కొన్ని లక్షల్లో ఆ నెంబర్ కు ఫోన్ కాల్స్ వచ్చాయట. ఆ బాధ భరించలేక ఎం.ఎస్.రాజు కూడా దెబ్బకు తన మొబైల్ నెంబర్ ను మార్చుకున్నారు అట.. నిజానికి అసలు కామెడీ అంటే ఇదే మరి..

మరింత సమాచారం తెలుసుకోండి: