ఇప్పుడు ఏ సినిమా కూడా 100 రోజుల కంటే ఎక్కువగా ఆడడం లేదు కానీ అప్పట్లో 1000 కంటే ఎక్కువ రోజులే సినిమాలు ఆడేవి. ఎందుకంటే అప్పట్లో స్మార్ట్ ఫోన్స్, స్మార్ట్ టీవీలు, కంప్యూటర్లు అందుబాటులో ఉండకపోవేవి. ఇప్పుడంటే వంద రోజుల్లోనే సినిమాలు టీవీలలో వస్తున్నాయి. 50 రోజుల్లోనే డిజిటల్ ప్లాట్ ఫారమ్ లపై విడుదల అవుతున్నాయి. ఐతే తెలుగు చలన చిత్ర రంగంలో 1000 రోజులు ఆడిన టాలీవుడ్ సినిమాలు ఏంటో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

1. లవకుశ

ఉత్తరరామాయణం ఆధారంగా 1963వ సంవత్సరంలో తెరకెక్కిన తెలుగు పౌరాణిక చిత్రం లవకుశ ఏకంగా 1111 రోజులు ఆడి సంచలనం సృష్టించింది. ఈ చిత్రం షూటింగు 1958వ సంవత్సరంలో ప్రారంభం అయింది. పూర్తిగా కలర్ లో వచ్చిన తొలి సినిమాగా లవకుశ పేరు తెచ్చుకుంది. అప్పట్లో సినిమా టికెట్స్ పావలా, రూపాయి మాత్రమే ఉండేవి. అయితే ఆ రోజుల్లోనే లవకుశ సినిమా కోటి రూపాయలు వసూల్ చేసింది. 60 లక్షల జనాభా ఉన్న వంద కేంద్రాల్లో 1.98 కోట్ల టిక్కెట్లు అమ్మి చెక్కుచెదరని రికార్డు నెలకొల్పింది.

2. మగధీర

మెగా పవర్ స్టార్ రాంచరణ్, అందాల తార కాజల్ అగర్వాల్ హీరోహీరోయిన్లుగా నటించిన మగధీర సినిమా కూడా శతకం రోజుల పాటు ఆడి రికార్డు సృష్టించింది. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 100 కోట్లు వసూలు చేసి తెలుగు సినిమాలు కూడా వందకోట్ల కలెక్షన్స్ చేయగలవని చాటిచెప్పింది.

3. పోకిరి

2006లో మహేష్ బాబు , పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన పోకిరి మూవీ సూపర్ డూపర్ హిట్ సాధించింది. 1000 రోజులకు పైగా ఆడిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద కోట్లలో కలెక్షన్ల వర్షం కురిపించింది. రూ.40 కోట్లు వసూల్ చేసిన పోకిరి మూవీ మగధీర కి ముందు టాలీవుడ్ చరిత్రలో అత్యధిక వసూళ్ళు సాధించిన మూవీగా చరిత్ర సృష్టించింది. ఐతే ఈ సినిమా షూటింగ్ కేవలం 70 రోజుల్లోనే పూర్తి చేసి ఆశ్చర్యపరిచారు.

4. లెజెండ్

2015లో వచ్చిన బోయపాటి శ్రీను, బాలకృష్ణ కాంబో లో వచ్చిన లెజెండ్ సినిమా 1005 రోజులు ఆడింది. ఈ సినిమా కూడా కోట్లలో వసూల్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: