సినిమాలకు సంబంధించి ఫిబ్రవరి మార్చి మధ్య కాలాన్ని అన్ సీజన్ గా పరిగణిస్తారు. అయితే ఈ విషయానికి భిన్నంగా ఫిబ్రవరి మార్చి నెలలలో విడుదలైన చిన్న సినిమాల సంఖ్య లెక్కకు కూడ అంతుచిక్కడం లేదు. అదేవిధంగా మహాశివరాత్రి సినిమాలకు సంబంధించి సీజన్ కాదు. అయితే దీనికి భిన్నంగా వచ్చే వారం రాబోతున్న ‘మహాశివరాత్రి’ కి ఒకేసారి మూడు సినిమాలు రాబోతున్నాయి.


శర్వానంద్ ‘శ్రీకారం’ అనీల్ రావిపూడి దర్శక పర్యవేక్షణలో ‘గాలి సంపత్’ సినిమాలతో పాటు చిన్న సినిమా ‘జాతి రత్నాలు’ కూడ విడుదల కాబోతోంది. ఈమూవీని నిర్మించింది నాగ్ అశ్విన్ కావడంతో ఈమూవీ పై కూడ అంచనాలు చాలానే ఉన్నాయి.  ఈమూవీ ఒకనాటి జంధ్యాల ఈవివి సత్యనారాయణల కామెడి మార్క్ మూవీలా ఉంటుందని ప్రచారం జరుగుతోంది.  


ఈ చిత్రాన్ని రూపొందించిన అనుదీప్ కేవీ ఇంతకుముందు ‘పిట్టగోడ’ అనే సినిమా తీశాడు. అది ప్రేమ ప్రధానంగా సాగే సినిమా. కానీ ఈసారి పూర్తిగా కామెడీ రూట్ ను ఎంచుకున్నాడు. నవీన్ పొలిశెట్టి ప్రియదర్శి రాహుల్ రామకృష్ణ లాంటి మంచి టాలెంటెడ్ నటులు ఈమూవీలో ఉండటంతో ఈ మూవీ ఎవరు ఊహించని విధంగా అందరికీ షాక్ ఇస్తూ మహాశివరాత్రి విజేతగా మారుతుందా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పుడు ఈ వార్త ఇండస్ట్రీ వర్గాలలో వైరల్ అవుతున్న పరిస్థితులలో యంగ్ హీరో శర్వానంద్ కు టెన్షన్ మొదలైంది అంటున్నారు. ఈమధ్య శర్వానంద్ వరస పరాజయాలు ఎదుర్కుంటున్నాడు.


ప్రస్తుతం అతడి సినిమాల మార్కెట్ కూడ అంతంతమాత్రంగా ఉంది. దీనితో ‘శ్రీకారం’ మూవీ సక్సస్ అతడి కేరియకు చాల కీలకంగా మారింది. ఒక డాక్టర్ కొడుకు డాక్టర్ ఒక పొలిటీషియన్ కొడుకు పొలిటీషియన్ ఒక హీరో కొడుకు హీరో అవుతుంటే ఒక రైతు కొడుకు రైతు ఎందుకు అవ్వడం లేదు అన్న పాయింట్ చుట్టూ ఈ మూవీ కథ తిరుగుతుంది. ప్రస్తుతం దేశం రైతు ఉద్యమాలతో హోరెత్తిపోతున్న పరిస్థితులలో ‘శ్రీకారం’ కు రెండు కామెడీ సినిమాలు ‘గాలి సంపత్’ ‘జాతి రత్నాలు’ కార్నర్ చేయడం శర్వానంద్ కు టెన్షన్ గా మారింది..


మరింత సమాచారం తెలుసుకోండి: