బాలీవుడ్ లో పరిచయం అక్కర్లేని పేరు రాఖీ సావంత్. సినిమాల్లో ఐటమ్ సాంగులే కాకుండా తన మాటలతో సోషల్ మీడియాలో రాఖీ సావంత్ తెగ క్రేజ్ ను సంపాదించుకుంది. అంతే కాకుండా బిగ్ బాస్ సీజన్ 14 లో ఎంట్రీ ఇచ్చిన రాఖీ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో రాఖీ ఆశక్తికర విషయాలు భయటపెట్టింది. తనకు ఇండస్ట్రీలో ఐటమ్ గర్ల్ గా గుర్తింపు రావడం వల్ల ఎలాంటి రిగ్రెట్స్ లేవని తెలిపింది. అంతే కాకుండా తనకు హీరోయిన్ అయ్యేంత సీన్ లేదని మొహమాటం లేకుండా చెప్పేసింది. బాలీవుడ్ లో అందరూ హీరోయిన్ లు కాలేరు..కొంతమందికి ఐటమ్ గర్ల్ గా ఛాన్స్ లు వస్తే మరికొందరికి అత్త ,కోడలు,అక్క ,చెల్లెలు లాంటి పాత్రలు వస్తాయి. అయినా నేను ఐటమ్ సాంగ్స్ చేయడం వల్ల నా కుటుంబాన్ని పోషించుకుంటున్నా. అంటూ బోల్డ్ కామెంట్స్ చేసింది. 

ఐటమ్ గర్ల్ అనే పేరు వచ్చిందుకు బాధ పడటం లేదని గర్వపడుతున్నానని రాఖీ పేర్కొంది. అంతే కాకుండా ఈ ఇంటర్వ్యూలో తన పెళ్లి విషయాన్ని కూడా రాఖీ భయటపెట్టింది. బ్రిటన్ కు చెందిన రితేష్ అనే వ్యాపారవేత్త తో తన వివాహం జరిగిందని రాఖీ చెప్పుకొచ్చింది. అయితే తాను హడావుడిగా పెళ్లి చేసుకోడానికి ఓ కారణం ఉందని చెప్పింది. గుజరాత్ కు చెందిన ఓ మాఫియా డాన్ తనను పెళ్లి చేసుకోవాలని వేధించేవాడని అతడి నుండి తప్పించుకునేందుకె రితేష్ ను పెళ్లాడానని చెప్పింది. ఆ మాఫియా డాన్ తో డేటింగ్ కు గోవా వెళ్లినట్టు తెలిపింది. అయితే అతడి ఫోన్ లో ఓ వీడియో ఉందని అందులో అతడు ఒకరిని కిరాతకంగా కొడుతున్నాడని చెప్పింది. ఆ వీడియో చూసి అతడికి దూరం గా ఉన్నానని అపుడే రితేష్ పరిచయం అవ్వడం తో పెళ్లి చేసుకున్నానని చెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి: