
ఈ మూవీపై మనదేశంతో పాటు ఇతర దేశాల్లో ఉన్న ఆడియన్స్ లో కూడా భారీ స్థాయిలో అంచనాలు ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా తరువాత మహేష్ తో రాజమౌళి చేయనున్న సినిమాని దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కె ఎల్ నారాయణ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. ఈ సినిమా సౌత్ ఆఫ్రికా లోని అడవుల నేపథ్యంలో సాగే భారీ అడ్వెంచరస్ డ్రామా మూవీ గా సాగుతుందని ఇప్పటికే ఈ సినిమా స్టొరీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రాజమౌళి ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు దగ్గరుండి చూసుకుంటున్నారని అంటున్నారు. విజయేంద్రప్రసాద్ కథను అందిస్తున్న ఈ సినిమాకి కీరవాణి మ్యూజిక్ అందించనున్నట్లు తెలుస్తోంది.
రాజమౌళి గత సినిమాలని ఒకసారి పరిశీలించినట్లయితే ఆయన తీసే సినిమాలకు సంబంధించి రిలీజ్ డేట్లు ముందుగానే ప్రకటిస్తుంటారు. కానీ ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల అందులో కొన్ని సినిమాలు వాయిదాలు పడిన ఘటనలు కూడా ఉన్నాయి. కానీ ఈసారి మహేష్ తో తీయబోయే మూవీ విషయంలో మాత్రం అటువంటి పరిస్థితులు ఏమాత్రం తలెత్తకుండా పక్కాగా ప్లానింగ్ తో యూనిట్ మొత్తానికి సూచనలు జారీ చేయటానికి రాజమౌళి సిద్దమవుతున్నారట. ముందుగానే అనుకున్న ప్రకారం పక్కాగా షెడ్యూల్ జరగాలని అలానే అనుకున్న విధంగానే ఈసారి తాము ప్రకటించనున్న రిలీజ్ డేట్ కి ఎట్టిపరిస్థితుల్లో మూవీ విడుదలయ్యేలా రాజమౌళి అందరికీ హుకుం జారీ చేయబోతున్నట్లు చెబుతున్నారు. మరి ఇదే గనుక నిజమైతే మహేష్ ఫ్యాన్స్ కి ఇది నిజంగానే సూపర్ గుడ్ న్యూస్ అని చెప్పక తప్పదు... !!