తిరుమల తిరుపతి దేవస్థానం ఆంజనేయుడు మనవాడే అంటూ ఆధారాలతో సహా ప్రకటించడంతో హనుమంతుడు తెలుగు వాడుగా మారిపోయాడు. ఇప్పుడు హనుమాన్ ని టాలీవుడ్ హీరోగా మార్చేస్తున్నాడు. ‘జాంబిరెడ్డి’ ‘కల్కి’ ‘అ’ లాంటి డిఫరెంట్ గా సినిమాలు తీసిన ప్రశాంత్ వర్మ ఇప్పుడు హనుమంతుడు ని టాప్ హీరోగా మార్చేస్తున్నాడు. ‘హను-మాన్’ అనే టైటిల్ తో నిర్మించబోతున్న ఈమూవీ వార్తలు ప్రస్తుతం సంచలనంగా మారాయి.
గతంలో హాలీవుడ్ లో వచ్చిన ‘సూపర్ మ్యాన్’ ‘స్పైడర్ మ్యాన్’ కథలకు స్పూర్తిగా ఈమూవీ ఉండబోతున్నట్లు సంకేతాలు వస్తున్నాయి. సూపర్ హీరో తరహా ఎలివేషన్స్ ఈ చిత్రంలో ఉండబోతున్నాయి. భారతీయ పురాణాల నుండి సేకరించిన అనేక కథల ఆధారంగా ఈమూవీ ఉండబోతోంది. హనుమాన్ భారతీయులకు సూపర్ హీరో ఈమూవీ టైటిల్ లోగో లో సూర్యుడు హను సూర్యుడు నుంచి ఉదయించాడు అన్న స్పూర్తితో ఈ పోష్టర్ ను డిజైన్ చేసినట్లు అనిపిస్తోంది. ఈమూవీకి సంబంధించిన మోషన్ పోష్టర్ ను చూసిన వారికి హిమాలయాల్లో అత్యద్భుతమైన లొకేషన్స్ ఈ మోషన్ టీజర్ లో కనిపిస్తున్నాయి.
దీనికితోడు ఈ మోషన్ పోష్టర్ కు సంబంధించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడ డిఫరెంట్ గా ఉంటూ ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తోంది. ఈమూవీ చాల భారీగా ఉంటుందనే సంకేతాలు వస్తున్నాయి. హీరోతో సహా ప్రాజెక్ట్ తారాగణం ఇతర సిబ్బంది వివరాల్ని త్వరలో ప్రకటిస్తారు. అని తెలుస్తోంది. సూపర్ హీరో సినిమాలు దశాబ్ధాలుగా హాలీవుడ్ ను శాసించడమే కాకుండా ప్రపంచ భాషలలో డబ్ చేయబడి వేలకోట్ల కలక్షన్స్ కొల్లగొట్టాయి.
డిసి - మార్వెల్ సూపర్ హీరో సినిమాలు భారీ బాక్సాఫీస్ కలెక్షన్లు సృష్టించిన విషయం తెలిసిందే. ఈమధ్య వచ్చిన ఎవెంజర్స్ ఎండ్ గేమ్ ఆల్ టైమ్ అత్యధిక వసూళ్లు చేసి రికార్డులు క్రియేట్ చేయడంతో ఈ సినిమాల స్పూర్తితో ప్రశాంత్ వర్మ ఈ భారీ ప్రాజెక్ట్ ను తీస్తున్నాడు. అయితే ప్రశాంత వర్మ సమర్థతను నమ్మి ఈమూవీకి ఎంతవరకు భారీ బిజినెస్ వస్తుంది అన్న విషయం పై రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి