చావు తప్పి కన్ను లొట్ట పోవడం అనే సామెత నితిన్ కెరియర్ కు సరిగ్గా సూట్ అవుతుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ నితిన్ కెరీర్ ఎండింగ్ దశలో ఉన్నప్పుడు ఒకే ఒక్క సినిమా ఆయన కెరీర్ ని కాపాడింది. ఆ సినిమా కనుక నితిన్ కి రాకపోయినా, హిట్ అవ్వకపోయినా ఇప్పుడు మనకు నితిన్ కనిపించే వాడు కాదేమో.. అంతలా నితిన్ కెరీర్ ని ప్రభావితం చేసిన ఆ సినిమా ఇష్క్. వెరైటీ చిత్రాల దర్శకుడు విక్రమ్ కుమార్ దర్శకత్వం లో నిత్యామీనన్ హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమా విడుదలైన రోజుల్లో సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. 

ప్రేమకథ కావ్యంగా తెరకెక్కి ఈ సినిమా అప్పటి లవర్స్ అందరినీ ఎంతగానో మెప్పించింది. సింపుల్ లైన్ అయినా స్క్రీన్ ప్లే తో అందరినీ ఆకట్టుకున్నాడు దర్శకుడు. ఆ తర్వాత నితిన్ గుండెజారి గల్లంతయింది అనే సినిమా చేయడం అది కూడా హిట్ అవడంతో మరి కొన్ని రోజుల వరకు నితిన్ కెరీర్ కు ఏ డోకా లేకుండా పోయింది. అంచెలంచెలుగా ఎదుగుతూ హీరోగా మారిపోయాడు నితిన్. అయితే పోయిన సంవత్సరం ఆయన తీసిన భీష్మ సినిమా సూపర్ హిట్ అయ్యాక రిలీజైన తర్వాతి రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ పరాజయం పాలయ్యాయి.

చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో ని చెక్ సినిమా ఒకరోజు కే థియేటర్లలో పరిమిత మవగా, ఎన్నో ఆశలతో వచ్చిన రంగ్ దే సినిమా కూడా చతికిలపడిపోయింది. దాంతో నితిన్ కెరియర్ మళ్లీ మొదటికి వచ్చినట్లయింది. ఈసారి చేయబోయే సినిమా సూపర్ హిట్ కొట్టాలని మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఓ బాలీవుడ్ రీమేక్ ను నమ్ముకున్నాడు. అక్కడ సూపర్ హిట్ అయిన అంధధూన్ అనే సినిమాను మ్యాస్ట్రో పేరుతో ఇక్కడ రీమేక్ చేస్తున్నాడు. ఈ సినిమా రీమేక్ కావడంతో నితిన్ కెరీర్ కు పెద్దగా ఉపయోగపడదు అని అనుకున్నాడో ఏమో తన స్నేహితుడితో చేయబోతున్న పవర్ పేట అనే సినిమాను హోల్డ్ లో పెట్టాడు. కృష్ణ చైతన్య దర్శకత్వంలో గతంలో చల్ మోహన్ రంగా సినిమా చేయాగా అది యావరేజ్ గా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమాను హోల్డ్ లో పెట్టాడు నితిన్. దీని స్థానంలో వక్కంతం వంశీ తో సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: