టాలీవుడ్ లో మాచో స్టార్ గా గోపీచంద్ తనదైన నటనతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. తొలివలపు సినిమాతో హీరోగా పరిచయమైన గోపీచంద్ ఆ తర్వాత విలన్ పాత్రలను చేసి ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. జయం, వర్షం, నిజం వంటి చిత్రాలలో గోపీచంద్ పండించిన విలనిజానికి టాలీవుడ్ ప్రేక్షకులు ముగ్ధులయ్యారు. ఆరడుగుల ఎత్తు, ఆజానుబాహుడు లాంటి రూపం కలిగి ఉన్న గోపీచంద్ విలన్ పాత్రలకు మాత్రమే పరిమితమై పోకూడదని ఆయన హీరోగా కూడా చేయాలని ఎంతో మంది ప్రేక్షకులు ఆరాటపడ్డారు. 

దానికి తగ్గట్లే గోపీచంద్ యజ్ఞం అనే పవర్ఫుల్ యాక్షన్ సినిమా ద్వారా హీరోగా రీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా సూపర్ హిట్ అయిందో లేదో తనకు వరుస సినిమాల్లో అవకాశాలు రావడం మొదలు పెట్టాయి. ఆంధ్రుడు, రణం, రారాజు, ఒక్కడున్నాడు, లక్ష్యం వంటి చిత్రాలు ఆయనను మంచి హీరోగా నిలబెట్టి టాలీవుడ్లో మినిమం హీరో కి ఉండే మార్కెట్ ను ఏర్పరిచాయి. ఆ తర్వాత యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారాడు గోపీచంద్. పాత్ర ఎలాంటిది అయినా తనదైన విలక్షణమైన నటనతో డైలాగ్ లతో ప్రేక్షకులను అలరించాడు. 

గోపీచంద్ కెరీర్లో చెప్పుకోదగ్గ సినిమాలు శౌర్యం, సాహసం. ఈ రెండు చిత్రాలలో గోపీచంద్ తనదైన నటనతో ప్రేక్షకులను అలరించాడు అని చెప్పవచ్చు. ఇకపోతే ఆయన గత కొన్ని సినిమాల గా వరుస ఫ్లాప్ లను ఎదుర్కొంటూ వస్తున్నాడు ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా ఏడు సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. లౌక్యం సినిమాతో 2014లో హిట్ కొట్టిన గోపీచంద్ ఆ తర్వాత చేసిన సౌఖ్యం, గౌతమ్ నందా, ఆక్సిజన్, ఆరడుగుల బుల్లెట్, పంతం, చాణక్య వంటి సినిమాలు డిజాస్టర్లుగా మిగిలాయి. ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో సిటీ మార్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా అయిన గోపీచంద్ కి హిట్ ఇస్తుందా లేదా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: