సినిమా ఇండస్ట్రీ లో డాన్సర్ గా తన కెరీర్ ను ప్రారంభించి కొరియోగ్రాఫర్ గా ఆ తరువాత నటుడిగా , దర్శకుడిగా తన సత్తా చాటుతూ ప్రేక్షకుల అభిమానాన్ని అందుకున్నారు రాఘవ లారెన్స్. కొరియోగ్రాఫర్ గా ఉన్నప్పుడు ప్రేక్షకుల్లో కొంత అభిమానం సంపాదించుకొని హీరోల్లో సైతం లారెన్స్ తో పనిచేయాలని అనిపించుకున్నాడు. అలా మొదట్లో కొరియోగ్రాఫర్ గా చేసి ఆ తర్వాత నాగార్జున హీరోగా నటించిన మాస్ చిత్రంతో దర్శకుడిగా మారాడు. తొలి సినిమాతోనే తన దర్శకత్వ ప్రతిభతో ఆకట్టుకున్న లారెన్స్ ఇక వెనుదిరిగి చూసుకోలేదు.

ఎప్పుడైతే  దర్శకుడు అయ్యారో అప్పటి నుంచి లారెన్స్ కెరీర్ ఊపందుకుంది. మాస్ తర్వాత వెంటనే స్టైల్, ముని వంటి చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకొని హిట్ కూడా అందుకున్నారు. ముఖ్యంగా హర్రర్ సినిమాలు చేయడంలో ఆయన స్పెషలిస్ట్ అయిపోయారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన ముని సినిమా కు కొనసాగింపుగా తెరకెక్కిన కాంచన, గంగ సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ గా నిలిచాయి. ఇటీవలే వచ్చిన కాంచన 3 సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది.

దాంతో దర్శకుడిగా ఆయన  విభిన్నమైన పేరుప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. అయితే గత కొన్ని రోజులుగా ఆయన సినిమాలు పెద్దగా సంతృప్తి ఇవ్వకపోవడంతో వెనుకబడి పోయారు. ముఖ్యంగా బాలీవుడ్ లో ఆయన అక్షయ్ కుమార్ హీరోగా కాంచన సినిమా రీమేక్ చేయగా ఆ సినిమా అక్కడ అత్యంత డిజాస్టర్ లిస్టు లో ముందు వరుసలో నిలిచింది. ఆ సినిమా అలా అవడంతో ఆయన నా దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలు ఆగిపోయాయట. ఈ ఒక్క సినిమా తనను మళ్లీ నటన వైపు చూసేలా చేసింది. అందుకే వేరే దర్శకుల సినిమాల్లో హీరోగా చేయడం ప్రారంభించారు. ప్రస్తుతం అధికారం ఏ సినిమాలో హీరోగా చేయబోతున్నారు లారెన్స్ ఈ సినిమానీ రాజకీయ నేపథ్యం గా తెరకెక్కబోతోందని తెలుస్తోంది. తన రూటు మార్చి కొత్త రూటు లో వెళుతున్న లారెన్స్ కు ఈ సినిమా ఏ రేంజ్ హిట్ ఇస్తుందోచూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: