
నటి రమ్యకృష్ణ దర్శకుడు కృష్ణ వంశీ నీ 2003 లో పెళ్ళాడారు. అప్పటికే ఆమె సౌత్ లో క్రేజీ హీరోయిన్ అలాంటి హీరోయిన్ ను కృష్ణవంశీ పెళ్లి చేసుకున్నందుకు చాలా మంది కుళ్లుకున్నారు. ఎంత అదృష్టం లేకపోతే రమ్యకృష్ణ లాంటి హీరోయిన్ నీ పెళ్లి చేసుకున్నాడు అని కథలు కథలుగా చెప్పుకున్నారు. ఎన్నో గ్లామర్ రోల్స్ చేసి ప్రేక్షకుల ఆరాధ్య దేవత గా పేరు తెచ్చుకున్న రమ్యకృష్ణ కెరీర్ నీ రజినీకాంత్ నరసింహ సినిమా మలుపు తిప్పింది. ఆ సినిమాలో నెగటివ్ రోల్ చేసిన ఆమె నటన ఇప్పటికీ ప్రేక్షకులు మర్చిపోలేదు.
వయసుకు అనుగుణంగా హీరోయిన్ పాత్రలు తగ్గిపోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా మారిపోయి రమ్యకృష్ణ తమదైన స్టార్డమ్ ను ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. బాహుబలి లో ఆమె శివగామి పాత్రకు చేసిన నటనకు గాను దేశవ్యాప్తంగా కీర్తిని తెచ్చిపెట్టింది. రమ్యకృష్ణ సినిమాల్లోకి రాకముందు టెలీ ప్లే లలో కూడా కూడా నటించారనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు. ఈ తరం వారికి ఈ టెలీ ప్లే గురించి పెద్దగా తెలియదు. అప్పట్లో టీవీ నాటకాలను టెలీ ప్లే లు అంటారు. ఈ విధంగా ఆమె సినిమాలలో టెలీ ప్లే లలో చేస్తూ మరొక రకంగా కూడా ఆమె తన జీవితాన్ని కొనసాగించిందట.
నాట్యం అంటే ఆమెకు ఎంతో అభిమానం వెంపటి చినసత్యం దగ్గర కూచిపూడి లో అక్షరాభ్యాసం నేర్చుకున్నారామె. ధనంజయ వద్ద భరతనాట్యం లో తొలి అడుగు వేశారు. మన దేశంలోని ప్రధాన నగరాల్లో నృత్య ప్రదర్శనలు ఇచ్చే అవకాశం లభించింది. అందుకే నాట్యం మీద ఉన్న అభిమానం కొద్దీ తన పాత్రలు నృత్య ప్రధానంగా ఉంటే బాగుంటుందని ఆమె అనుకునేవారు. తెలుగులో భలే మిత్రులు ఆమె మొదటి చిత్రం కాగా ఆ తర్వాత ఎన్నో చిత్రాల్లో నటించి నటిగా స్థిరపడ్డారు. ఆమెకు వినయ అనే ఓ చెల్లెలు కూడా ఉంది. వినయ కు ఆటలు అంటే చాలా ఇష్టం. టేబుల్ టెన్నిస్ లో ఎన్నో బహుమతులు కూడా గెలుచుకున్నారు.