
తమిళనాట స్టార్ హీరో అయిన సూపర్ స్టార్ రజినీకాంత్ తన లేటెస్ట్ మూవీ నీ దర్శకుడు శివ కాంబినేషన్ లో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ అన్నాత్తే సినిమాగా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ చిత్రం లో మీనా, కుష్బూ, కీర్తి సురేష్, నయనతార, జగపతిబాబు, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇమాన్ సంగీత సారథ్యం వహిస్తున్నారు.
కాగా ఈ మూవీ ఈ దీపావళికి విడుదల అవుతుందని ప్రచారం జరుగుతుంది. కానీ కరోనా కారణంగా మూవీ షూటింగ్ నిలిచిపోవడంతో అనుకున్న సమయానికి విడుదల అవుతుందా లేదా అన్న సందేహం అభిమానుల్లో నెలకొంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర నిర్మాణ సంస్థ అభిమానులకు శుభవార్త ను తెలియజేసింది. మొదటి నుంచి ఈ సినిమా పై వస్తున్న వార్తలను నిజం చేస్తూ దీపావళికి విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
ప్రస్తుతం దర్శకుడు శివ ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్నాడట. అయితే రజనీకాంత్ కు ఇక్కడే సమస్య వచ్చి పడింది. తెలుగులో ఈ సినిమాని విడుదల చేసే టైటిల్ కోసం ఎంతో వెతుకుతున్నారు. అన్నత్తే ఈ చిత్రానికి టాలీవుడ్ నుంచి ఇద్దరు స్టార్స్ చిరంజీవి బాలకృష్ణ నటించిన సినిమా లోని ఒక పాత టైటిల్ ను తీసుకోవాలని చూస్తున్నారట. ముఖ్యంగా అన్నయ్య అనే అర్థం వచ్చేలా రజనీకాంత్ సినిమాకి తెలుగులోనీ ఈ ఇద్దరు స్టార్స్ పాత సినిమా టైటిల్ ను వెతుకుతున్నారట. ఆ విధంగా పెద్దన్నయ్య లేదా అన్నయ్య అని టైటిల్ లను రజినీకాంత్ కొత్త సినిమా టైటిల్ వచ్చేలా ఆలోచిస్తున్నారట. ఇకపోతే గత కొన్ని రోజులుగా వరుస సినిమాలు చేస్తూ వస్తున్న రజినీకాంత్ ఈ సినిమా తర్వాత సినిమాలు చేస్తారో లేదో అన్న అనుమానాలు వ్యక్తమవుతునాయి.