తెలుగు చిత్ర పరిశ్రమలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు వచ్చాయి అంటే వాతావరణం ఎంత హాట్ హాట్ గా మారిపోతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.  గతంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జరిగిన సమయంలో ఎంతో మంది ఒకరిపై ఒకరు విమర్శలు  చేసుకున్నారు. ఇక ఇటీవల మరోసారి మా ఎన్నికల నేపథ్యంలో తెలుగు ఇండస్ట్రీలో వాతావరణం హాట్ టాపిక్ గా మారిపోయింది.  మా ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ లాంటి సీనియర్ నటుడు ఇక అధ్యక్ష పదవి కోసం పోటీ చేస్తూ ఉన్నారు.  అదే సమయంలో ఇక మంచు ఫ్యామిలీ నుంచి మంచు విష్ణు కూడా పోటీ చేస్తూ ఉండడం హాట్ టాపిక్ గా మారిపోయింది.


 అయితే వరుసగా మీడియా సమావేశాలు ఏర్పాటు చేస్తున్న మంచు విష్ణు మా ఎన్నికలకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. ఎన్నికల విషయంలో ఇండస్ట్రీ పెద్దలు  వెంటనే కలుగజేసుకోబోవాలని ఎన్నికలు ఏకగ్రీవంగా ముగిసే విధంగా చూడాలి అంటూ ఇటీవలే మంచు విష్ణు విజ్ఞప్తి చేశారు. అలా చేస్తే తాను ఎన్నికల నుంచి తప్పుకుంటానని అంటూ చెప్పారు.  అయితే ఇండస్ట్రీ పెద్దలైన మెగాస్టార్ చిరంజీవి మోహన్ బాబు లు మంచి మిత్రులు అయినప్పటికీ మెగా ఫ్యామిలీ మాత్రం ప్రకాశ్ కి మా ఎన్నికల్లో  మద్దతు పలుకుతూ ఉంది.



 ఇకపోతే మరోసారి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల గురించి మంచు విష్ణు సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరు జైలుకు వెళ్లకుండా బయట తిరుగుతున్నారని ఎక్కువ మాట్లాడితే వారి పేర్లు కూడా బయట పెడతానంటూ మంచు విష్ణు సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో దాసరి నారాయణ, అక్కినేని నాగేశ్వరరావు లాంటి దిగ్గజ నటులు అటు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి అండగా ఉండేవారు అంటూ మంచు విష్ణు గుర్తు చేశారు. కానీ ప్రస్తుతం ఇండస్ట్రీకి పెద్ద దిక్కు కరువైంది అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు మంచు విష్ణు. కొన్ని రోజుల్లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పరస్పర విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ విమర్శల నేపథ్యంలో మా ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: