టాలీవుడ్ సినీ పరిశ్రమలో హిట్ ఉంటే గానీ ఎంత పెద్ద హీరోనైనా పట్టించుకోని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో హిట్ కొట్టాలని ప్రతి ఒక్క హీరో ఎంతో కష్టపడి సినిమా చేస్తున్నారు. కథ ఎంపిక చేసుకోవడం దగ్గర్నుంచి ప్రతి ఒక్క విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకొని మరీ సినిమాలు తీస్తున్నారు. పెద్ద పెద్ద హీరో లు సైతం సినిమా స్టోరీ ఎంపికలో తమదైన ప్రత్యేకతను చాటుతున్నారు. అయితే యువ హీరోల పరిస్థితి వారికి భిన్నంగా ఉంది. ఏ సినిమా పడితే ఆ సినిమా చేస్తూ తమ కెరీర్ను నాశనం చేసుకుంటున్నారు. అలా సందీప్ కిషన్ గత కొన్ని సినిమాలు వరుస ఫ్లాప్ సినిమాలు చేస్తూ తెలుగు ప్రేక్షకులను విసిగిస్తున్నాడు.
ప్రస్థానం సినిమాతో నటుడిగా పరిచయం అయిన సందీప్ కిషన్ రొటీన్ లవ్ స్టోరీ సినిమాతో పూర్తి స్థాయి హీరోగా మారి మంచి హిట్టు అందుకున్నాడు. ఆ తర్వాత వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమా ఆయన కెరీర్ లో ఆయనకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఆ సినిమా హిట్ సాధించి పది సంవత్సరాలు దాటుతున్నా సందీప్ కిషన్ కు మాత్రం ఇంతవరకు ఆ రేంజ్ దక్కలేదనే చెప్పాలి. ఇటీవలే ఆయన హీరోగా నటించిన ఏ వన్ ఎక్స్ ప్రెస్ సినిమా తో ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయాడు. దాంతో ఆయన తదుపరి సినిమా గల్లీ రౌడీ పైనే నమ్మకం పెట్టుకున్నాడు సందీప్ కిషన్.
ఈ సినిమా కాక మరో నాలుగు సినిమాలను కూడా ఆయన లైన్ లో పెట్టాడు. తమిళ భాషలో సైతం ఆయన హీరోగా నటిస్తూ అక్కడి ప్రేక్షకులను అక్కడ మార్కెట్ పెంచుకుంటున్నాడు. అయితే ఎన్ని ఫ్లాప్ లు వచ్చినా ఆయన కెరీర్ సాగడానికి, సినిమా లి చేయడానికి కారణం ఓటీ టీ అనీ తెలుస్తోంది. ఆయన సినిమాలు థియేటర్లో ఆడకపోయినా ఓటీటీ లో ఎంతో కొంత రేటు ఇచ్చి డబ్బు తిరిగి సంపాదించుకోవచ్చు అని నిర్మాతలు చేస్తున్నారు. తాజాగా ఆయన నటించిన నరకాసురన్ సినిమా ఓటీటీ లోనే రిలీజ్ అవుతుంది. సోనీ వారు ఈ సినిమాని నాలుగు కోట్లకు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి