సినీ ఇండస్ట్రీలో నాటి నుంచి నేటి వరకు చాలా మంది నటీనటులు వారి బంధువులను, పాత మిత్రులను సొంత వారిని సినీ ఇండస్ట్రీలోకి తీసుకుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు తండ్రీకొడుకులు, తల్లీకూతుళ్లు, బావ బామ్మర్దులు, అన్నదమ్ములు మాత్రమే వెండితెరపై అలరించారు. కానీ ఇక్కడ బుల్లితెర మీద మాత్రం సొంత అత్తా కోడళ్ళు బుల్లితెరపై అడుగుపెట్టి, తమ సత్తా ఏంటో చాటుతున్నారు. అంతే కాదు ఒకరి కంటే ఒకరు బాగా నటిస్తూ, ప్రేక్షకులను అలరిస్తున్నారు. అయితే బుల్లితెరపై నటిస్తున్న సొంత అత్తా కోడళ్లు ఎవరనేది ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..


1. షాను సన - సమీరా షరీఫ్:
షాన్  సన సినీ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటీమణి. అంతేకాదు ఈమె బుల్లితెరపై కూడా నటిస్తోంది. ఇక ఈమె కొడుకు అయిన సయ్యద్ అన్వర్ ను సమీరా షరీఫ్ వివాహం చేసుకుంది. సమీరా కూడా సినీ ఇండస్ట్రీలో పలు సీరియల్స్ లో నటిస్తూనే,కొన్ని  ప్రోగ్రామ్లకు యాంకర్ గా వ్యవహరిస్తోంది. ఇక అలా వీరిద్దరూ సొంత అత్తా కోడళ్ళు బుల్లితెరపై రాణిస్తున్నారు.

2. లక్ష్మీ కనకాల - సుమ కనకాల:
బుల్లితెర క్వీన్  గా కొనసాగుతున్న సుమ కనకాల,  రాజీవ్ కనకాల తల్లి లక్ష్మీ కనకాల కూడా పలు సీరియల్స్ లో నటించి అందరినీ మెప్పించింది. ఇక అప్పట్లో అత్త కోడళ్ళు గా బుల్లితెరపై అడుగు పెట్టి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.


3. శ్రీలక్ష్మి - ఐశ్వర్య రాజేష్:
శ్రీలక్ష్మి అటు సీరియల్స్ లోనూ , ఇటు  సినిమాల్లోను నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఈమె తమ్ముడు రాజేష్ కూతురు ఐశ్వర్య రాజేష్ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఐశ్వర్య రాజేష్ కు శ్రీలక్ష్మి మేనత్త అవుతుంది. అలా  వీరిద్దరు కూడా సొంత అత్తా కోడళ్ళు.


వీరితో పాటు మరింత మంది అత్తా కోడళ్ళు వచ్చి బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: