ప్రస్తుతం థియేటర్లలో సినిమాలు విడుదల చేసి ధైర్యం చేస్తున్న హీరోలు చాలా తక్కువగా ఉన్నారు. అందులోనూ టాలీవుడ్లో చిన్న హీరోలు మాత్రమే ఈ విధమైన ధైర్యం చేశారు. సత్యదేవ్ ,
తేజ సజ్జ లు మాత్రమే ఇప్పుడు తమ సినిమాలను థియేటర్లలో విడుదల చేశారు. చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి హీరోగా మారిన
తేజ ఈ సంవత్సరం ఆల్రెడీ జాంబీ
రెడ్డి వంటి సినిమాతో సూపర్ హిట్ సొంతం చేసుకోగా సమ్మర్ కానుకగా మరో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకున్నారు కానీ సెకండ్ వేవ్ కారణంగా ఆ
సినిమా విడుదల ఆగిపోయింది.
దాంతో తాను నటించిన ఇష్క్ సినిమాను ఓ టీ టీ లో విడుదల చేయాలని మొదట అనుకున్నారు అయితే మంచి మంచి ఆఫర్స్ వచ్చినా కూడా
సినిమా చూసిన తరువాత థియేటర్లలో అయితేనే దానికి మంచి ఆదరణ దక్కుతుంది అని చెప్పి వారు ఆ ఆఫర్ లని రిజెక్ట్ చేశారట. అయినా కూడా ఒక దాని తర్వాత మరొకటి వచ్చి సినిమాకి 8 కోట్ల దాకా ఆఫర్ చేశారట. అయినా థియేటర్లలో సినిమాను రిలీజ్ చేయాలని గట్టిగా ఫిక్స్ అయ్యారు. ఈ రోజే ఈ
సినిమా థియేటర్లలో విడుదల కాగా ఈ సినిమాకు సంబంధించిన ఓవరాల్ బిజినెస్ లెక్కలు చూద్దాం.
ఆ బిజినెస్ లెక్కలు చూస్తే
తేజ సజ్జ నమ్మకం నిజమైందని అర్థమవుతుంది.వీరు థియేటర్లోకి రావడమే మంచిదయింది అని అంటున్నారు ప్రేక్షకులు సైతం. నైజాంలో ఒకటిన్నర కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ సాధించిన ఇష్క్
సినిమా ఆంధ్ర లో 1.1 కోట్ల బిజినెస్ ను సొంతం చేసుకుంది. ఇక రెస్ట్ ఆఫ్
ఇండియా ఓవర్సీస్ లో కలిపి మొత్తం పది లక్షల బిజినెస్ జరగగా మొత్తం గా 2.5 కోట్ల బిజినెస్ ను సొంతం చేసుకొని మంచి చిత్రంగా మిగిలింది. ఇక ఈ
సినిమా మంచి టాక్ తెచ్చుకుంటే మంచి లాభాలతో ఈ
సినిమా బయటపడుతుంది. ఆల్మోస్ట్ 285 థియేటర్లలో విడుదలైన ఈ
సినిమా కచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుంది అని అంటున్నారు.