ఒక సినిమాలో నటించబోయే హీరోయిన్ స్థానంలో వేరే హీరోయిన్ రీప్లేస్ అవ్వడం సినిమా పరిశ్రమలో జరిగే అరుదైన విషయం. ఏదో ఒక కారణంగా ఒక సారి ఓకే అనుకున్న తర్వాత సదరు హీరోయిన్ వెళ్లిపోవాల్సి ఉంటుంది. సినిమా యూనిట్ కి నచ్చకపోయినా ఆమెకు నచ్చకపోయినా ఆ సినిమా నుంచి వెళ్ళిపోవాల్సిందే ఆ హీరోయిన్. అయితే ఆ విధంగా సినిమాను పోగొట్టుకొని ఇండస్ట్రీకి దూరమైన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ కొంతమంది ఇంకా పట్టుదలతో నిలబడి దాని కంటే మంచి సినిమాలో నటించడానికి చూస్తూ ఉంటారు.

ఇండస్ట్రీకి ఎక్కువగా ఇతర భాషల నుంచి హీరోయిన్స్ వస్తూ ఉంటారు. వారికి భాష రాకపోవడం కారణంగా వారు, వారితో నటించే వారు ఇబ్బందులు పడుతుంటారు. అలనాటి నటీమణి జయంతి కి ఈ భాష విషయంలో ఇలానే జరిగిందట. ఆమెకు తమిళ భాష రాకపోవడం వల్ల మహానటి సావిత్రి ఎంతో మంది ఇబ్బంది పడ్డారట. కన్నడలో స్టార్ హీరోయిన్ గా ఎదుగుతున్న జయంతి ఓ సినిమాలో నటిస్తున్న సమయంలో ఎంత సేపటికీ డైలాగ్స్ చెప్పడం రాకపోవడంతో దర్శకుడు అనేక షాట్స్ తీసుకోవాల్సి వచ్చింది. దాంతో అది సావిత్రి కి ఇబ్బందికరంగా మారిందట. 

అప్పుడు ఆమె వెంటనే దగ్గరికి వెళ్లి డైలాగ్ చెప్పని వాళ్లను కూడా ఎందుకు సినిమాల్లో నతింపచేస్తారు అని చెప్పిందట. ఆ మాటతో జయంతి ఏడ్చిందట.ఆ తర్వాత నిర్మాతలను కలిసి తాను నటించనని చెప్పిందట. ఎంత ఖర్చయిందో చెప్తే అంత మొత్తాన్ని ఇచ్చేస్తానని చెప్పి వెళ్లిపోయిందట. ఆ తర్వాత కొన్నాళ్లకు సావిత్రికన్నడ సినిమా లో నటించింది. అదే సినిమాకు జయంతి కూడా నటించగా ఆమె వెళ్లి సావిత్రి కాళ్ళ మీద పడ్డదట అప్పుడు సావిత్రి నువ్వు నా కాళ్ళ మీద పడట ఏంటి అనగా ఆ రోజు జరిగిన సంఘటన గుర్తు చేసి అది తనను ఎంతో మార్చేలా చేసింది ఇప్పుడు అన్ని భాషలలో మాట్లాడుతున్నాను అని చెప్పింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: