విజయ్ సేతుపతి హీరోగా, శృతి హాసన్ హీరోయిన్ గా కలిసి నటిస్తున్న చిత్రం లాభం. ఈ చిత్రం షూటింగ్ ఎప్పుడో పూర్తి చేసుకుంది. కానీ కరోనా కారణంచేత.. ఈ సినిమా వాయిదా పడుతూ వస్తోంది. ఈ సినిమాని మూడు భాషల్లో ఒకేసారి విడుదల చేస్తున్నారు. ఇక విజయ్ సేతుపతి క్రేజ్ బాగా సంపాదించిన తరువాత విడుదల చేస్తున్న సినిమా ఇది.
ఇక ఈ సినిమాలో జగపతిబాబు, హన్సిక కూడా ఒక ముఖ్య పాత్రను పోషిస్తున్నట్లు తెలుస్తోంది. అందుచేతనే ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాని డైరెక్టర్..S.P. జననాధన్ తెరకెక్కించడం జరిగింది. ఈ సినిమా శ్రీ గాయత్రి దేవి ఫిలిమ్స్ బ్యానర్ పై నిర్మించారు. ఇక ఈ సినిమా తెలుగు థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే..
1). నైజాం- రూ.30 లక్షలు.
2). సీడెడ్- రూ.10 లక్షలు.
ఆంధ్ర టోటల్- రూ.40 లక్షల రూపాయలు.
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తం కలుపుకొని..80 లక్షల రూపాయల వరకు థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాలలో చాలా మటుకు ఆయా నిర్మాతలు విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా హిట్ గా నిలవాలంటే మాత్రం.. దాదాపుగా కోటి రూపాయల షేర్ రాబట్టాల్సిందే.
ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఇది సాధించడం కష్టమనే చెప్పాలి. ఇక కొన్ని సినిమాలు ఓటిటి లో విడుదల అవుతున్నాయి. ఇక థియేటర్ల విషయానికి వస్తే, సిటీ మార్ సినిమా తప్ప మరి ఎటువంటి క్రేజీ మూవీ కూడా థియేటర్ లలో విడుదల అవ్వలేదు. అయితే విజయ్ సేతుపతి లాభం చిత్రం కోటి రూపాయలు వసూలు చేస్తుందేమో వేచి చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి