విక్టరీ వెంకటేష్ హీరోగా తెరకెక్కిన‌ సూపర్ డూపర్ హిట్ అయిన మూవీ దృశ్యం. ఇప్పుడు దృశ్యం సినిమాకు సీక్వెల్ గా వచ్చిన దృశ్యం 2 కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గత కొద్ది నెలల ముందే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయాలా ? లేదా ఓటీటీ లో రిలీజ్ చేయాలా ? అన్నదానిపై సినిమా నిర్మాత సురేష్ బాబు చాలా స‌మాలోచ‌న లు జ‌రిపారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ సినిమా ను థియేటర్లలో రిలీజ్ చేయ‌డం కంటే ఓ టీటీ లో రిలీజ్ చేసేందుకు ఆసక్తి చూపారు. దీంతో దృశ్యం 2 సినిమా గత రాత్రి అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయింది. ఈ సినిమా చూస్తున్న ప్రేక్షకులకు అద్భుతంగా ఉందని ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సినిమా కథ ఆద్యంతం తీవ్రమైన ఉత్కంఠతో ఆకట్టుకుందని చెబుతున్నారు.

ఇక దృశ్యం 2 క‌థ చాలా ఉత్కంఠ గా ఉంది. త‌న కుటుంబాన్ని కాపాడుకోవ‌డానికి రాంబాబు మ‌ళ్లీ ఎలా ? వ‌చ్చాడు... ఈ సారి ఎలా ?  ఏం జ‌రిగింది ? రాంబాబు సినిమా తెలివితేట‌లు త‌న కుటుంబాన్ని కాపాడు కోవ‌డానికి ఎంత ? వ‌ర‌కూ ఉప‌యోగ‌ప‌డ్డాయి..? అన్న‌దే ఈ దృశ్యం 2 క‌థ‌. ఆరేళ్ల క్రితం రాంబాబు జీవితంలో ఏం జ‌రిగిందో అంద‌రికీ తెలిసిన విష‌య‌మే.. !  ఆరేళ్ల క్రితం క‌థ‌లో త‌న కూతురిపై క‌న్నేయ‌డంతో పాటు త‌న కుటుంబాన్ని చిన్నాభిన్నం చేయ‌డానికి  ప్లాన్ చేసిన‌ వ‌రుణ్ ని రాంబాబు (వెంక‌టేష్‌) చంపేయ‌డంతో పాటు ఆ శ‌వాన్ని కూడా కొత్తగా క‌డుతున్న పోలీస్ స్టేష‌న్‌లోనే పాతి పెట్టేసి.. ఒక్క సాక్ష్యం కూడా దొర‌క కుండా చేస్తాడు.

అయితే ఈ హ‌త్య చేసింది రాంబాబే అని అంద‌రికి తెలుసు. అయితే అందుకు త‌గిన ఒక్క సాక్ష్యం కూడా ఉండ‌దు. అయితే ఇక్క‌డ శవం కూడా ఉండ‌దు. క‌నీసం శవం అయినా దొరికితే క్లూస్ ద్వారా రాంబాబు ను కేసులో ఇరికించాల‌ని పోలీసులు భావిస్తారు. దీంతో వారు మ‌ళ్లీ రంగంలోకి దిగుతారు. మ‌ళ్లీ మ‌ఫ్టీలో రాంబాబు ఫ్యామిలీపై క‌న్నేసి ఉంచుతారు. అయితే ఈ సారి నిజం బ‌య‌ట‌కు వ‌చ్చిందా ?  ఏం జ‌రిగింది ? అన్న‌దే ఈ సినిమా క‌థ. ఈ కుదుపు నుంచి రాంబాబు  ఈసారి ఎలా త‌ప్పించుకున్నాడు ? అన్న దానిని ఆస‌క్తి గా తెర‌కెక్కించారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: