మెగా కాంపౌండ్ కు అల్లు అర్జున్ కు చిన్న గ్యాప్ ఉంది అన్న ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతోంది. ఈ మాటలకు మరింత బలం చేకూర్చేలా నిన్న జరిగిన ‘అఖండ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అల్లు అర్జున్ తీరు ఉంది అంటూ ఈ ఈవెంట్ ముగిసిన తరువాత కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు అల్లు అర్జున్ బాలకృష్ణ సినిమాలకు సంబంధించి ఏ ఫంక్షన్ కు అతిధి గా రాలేదు.


ఇప్పుడు అతిధి గా రావడమే కాదు తమ అల్లు కుటుంబానికి నందమూరి కుటుంబానికి ఎప్పటి నుంచో సాన్నిహిత్యం ఉంది అంటూ పదేపదే అల్లు ఫ్యామిలీ ప్రస్తావన తీసుకు వచ్చాడు కానీ ఎక్కడా మెగా ఫ్యామిలీ ప్రస్తావన తీసుకు రాకపోవడం చాల మందిని ఆశ్చర్యపరిచింది. అంతేకాదు బాలకృష్ణ కు ఉన్న కమిట్మెంట్ డెడికేషన్ డిక్షన్ తాను మరే హీరోలోను చూడలేదు అంటూ బన్నీ చేసిన కామెంట్స్ ఇప్పుడు మెగా అభిమానుల మధ్య వైరల్ గా మారాయి.
కెరియర్ ప్రారంభంలో మెగా ఫ్యామిలీ అండతో ఎదిగిన అల్లు అర్జున్ ఇప్పుడు తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ఏర్పడటంతో మెగా ఫ్యామిలీ ముసుగు నుండి బయటకు రావడానికి ప్రయత్నిస్తున్నాడా అంటూ మరికొందరు విశ్లేషణ చేస్తున్నారు. అదేవిధంగా బన్నీ తన ఉపన్యాసంలో ఎక్కడా సంక్రాంతి సినిమాలకు సంబంధించి ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ తప్ప ‘భీమ్లా నాయక్’ ‘రాథే శ్యామ్’ పేర్లు ప్రస్తావించక పోవడం పవన్ ప్రభాస్ అభిమానులకు అసహనాన్ని కల్గిస్తున్నాయి.


వాస్తవానికి ఇప్పటి వరకు అల్లు అర్జున్ ఎప్పుడు ఏ ఫంక్షన్ లో మాట్లాడినా తన కట్టె కాలే వరకు చిరంజీవి వీరాభిమాని ని అని చెపుతూ వచ్చాడు. అయితే ఇప్పుడు అనూహ్యంగా బన్నీ అభిమానుల లిస్టులో బాలకృష్ణ వచ్చి చేరడం దేనికి సంకేతం అంటూ ఇండస్ట్రీ వర్గాలలో కామెంట్స్ మొదలయ్యాయి. అయితే బన్నీ మాట్లాడిన ఈ మాటలు ఎదో యధాలాపంగా అన్నవి మాత్రమే అనీ దానికి ఇంత రంధ్రాఅన్వేషణ అనవసరం అంటూ మరికొందరు అభిప్రాయ పడుతున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: