‘ఆర్ ఆర్ ఆర్’ ట్రైలర్ చూసినవారికి ఈ విషయంలో రాజమౌళి చాల తెలివిగా ప్రవర్తించి చరణ్ జూనియర్ లను సరిసమానంగా చూసుకున్నాడు అని చూసినవారికి అనిపిస్తుంది. అయితే ముంబాయ్ లో జరిగిన ‘ఆర్ ఆర్ ఆర్’ ట్రైలర్ లాంచ్ ఫంక్షన్ కు కీలక నటీనటులు అంతా వచ్చినప్పటికీ రామ్ చరణ్ ఆ ఫంక్షన్ కు రాకపోవడంతో అతడికి ఏమైంది అంటూ బాలీవుడ్ మీడియా రకరకాల ఊహాగానాలు చేయడమే కాకుండా చరణ్ కు రాజమౌళికి మధ్య గ్యాప్ ఏర్పడిందా అన్న స్థాయిలో కూడ వార్తలు వ్రాశాయి.
ముంబయి ప్రెస్ మీట్ కు కావాలనే చరణ్ ను తప్పించారని ఎన్టీఆర్ ను హైలెట్ చేశారని రకరకాల ఊహాగానాల హడావిడి మొదలైంది. అయితే ఈ విషయంలో కొంచం ఆలస్యంగా క్లారిటీ వచ్చింది. వాస్తవానికి ఈ ఈవెంట్ కు రమ్మని రాజమౌళి చరణ్ పై తీవ్ర ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. కానీ చరణ్ భార్య ఉపాసన ఇంటిలో ఒక పెళ్ళి జరుగుతున్న పరిస్థితులలో చరణ్ ఆ పెళ్ళికి ఖచ్చితంగా వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడిందట.
పెళ్లి తంతులో జరగవలసిన ఒక పూజలో చరణ్ ఉపాసన కూడ కూర్చోవాల్సిన పరిస్థితిలో చరణ్ ముంబాయిలో జరిగిన ట్రైలర్ లాంచ్ ఫంక్షన్ కు రాలేదని తెలుస్తోంది. అయితే ఆతరువాత హైదరాబాద్ లో జరిగిన ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ మీడియా మీట్ లో చరణ్ జూనియర్ లు కలిసి సందడి చేయడంతో రామ్ చరణ్ పై వచ్చిన ఊహాగానాలు అన్నీ గాలిబుడగలు అని తేలిపోవడంతో చరణ్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి