టాలీవుడ్ లో ఆర్య ఆర్య 2 వంటి సూపర్ హిట్ చిత్రాల తరువాత అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో రాబోతున్న హ్యాట్రిక్ మూవీ 'పుష్ప'. గంధపు చెక్కల స్మగ్లర్ ఈ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాని ముత్తంశెట్టి మీడియా తో కలిసి movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ భారీ బడ్జెట్తో నిర్మించారు. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ కి జోడిగా మొదటిసారి కన్నడ బ్యూటీ రష్మిక మందన కథానాయికగా నటిస్తోంది. మలయాళ నటుడు పాహద్ పజిల్, సునీల్, అనసూయ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా..

 పార్ట్ వన్ డిసెంబర్ 17 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే.ఇక విడుదల తేదీ దగ్గర పడటంతో సినిమా ప్రమోషన్స్ ని స్పీడ్ చేసింది చిత్ర యూనిట్. ఈ నేపథ్యంలోనే తాజాగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అల్లు అర్జున్సినిమా విషయంలో ఆయనకు ఎదురైన సమస్య గురించి చెప్పుకొచ్చారు. ఈ సినిమాలో తాను మేడ కాస్త పైకెత్తి నటించడం వల్ల ఓ సమస్యను ఎదుర్కొన్నట్లు బన్నీ ఇంటర్వ్యూలో తెలిపాడు.' ఈ సినిమా మొత్తం భుజం పై కెత్తి చేశాను. షూటింగ్ చివరికి వచ్చేసరికి నాకు మెడ పట్టేసింది. అలా పెట్టడం వల్ల నా మెడ భాగం చిన్నగా అయిపోయింది. దీంతో ప్రతీ రోజు లేవగానే..

 నా మెడను ఓ పదిహేను నిమిషాలపాటు ఫుల్ స్ట్రెచ్ చేసేవాడిని' అంటూ అల్లు అర్జున్ చెప్పుకొచ్చాడు.సుకుమార్ మొదట కథ చెప్పినప్పుడే తనకు  సినిమా మొత్తం పైకెత్తి నటించాలని చెప్పాడని బన్నీ అన్నాడు. అయితే ఈ సినిమా కోసం కచ్చితంగా చేయాలని దాన్ని ఛాలెంజింగ్ గా తీసుకున్నాను అంటూ చెప్పుకొచ్చాడు బన్నీ. దీంతో పుష్ప సినిమా కోసం బన్నీ ఎంతలా కష్టపడ్డాడో అర్థమవుతుంది. అయితే మరో వైపు ఈ సినిమా పై సౌత్ ఇండస్ట్రీ మొత్తం లోనే భారీగా అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాతో కచ్చితంగా బన్నీకి  పాన్ ఇండియా ఇమేజ్ వస్తుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: