కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన గంగోత్రి సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు బన్నీ. మొదటి సినిమా మంచి విజయం సాధించింది. కానీ బన్నీకి అనుకున్నంతగా గుర్తింపు మాత్రం రాలేదు. ఇక ఆ తర్వాత మరి కొన్ని సినిమాలు చేసినా స్టార్ హీరో రేంజ్ ని మాత్రం సంపాదించ లేక పోయాడు అల్లుఅర్జున్. అలాంటి సమయంలో సుకుమార్తో ఒక సినిమా చేశాడు అదే ఆర్య. ఇప్పటివరకు తెలుగు ప్రేక్షకులకు పరిచయం లేని వినూత్నమైన కాన్సెప్టుతో సినిమా తెరకెక్కింది. ప్రియురాలి చెప్పే ఐ హేట్ యు పదాన్ని ఐ లవ్ యు గా భావించి ప్రేమించే ప్రేమికుడు ఆర్య.
ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కొత్త దాన్ని పరిచయం చేసింది. ఇలా కూడా ప్రేమించ వచ్చా అనీ యూత్ ను ఆలోచింపజేసింది.. నిజమైన ప్రేమ ఎప్పుడు గెలుస్తుంది అని ఈ సినిమా ఒక మంచి మెసేజ్ ఇచ్చింది. మొత్తంగా సాదాసీదా హీరోగా ఉన్న అల్లు అర్జున్ ను ఆర్య సినిమా స్టార్ హీరోని చేసింది. ఇక అటు సుకుమార్ కి కూడా ఎంతగానో గుర్తింపు వచ్చింది. ఆర్య సినిమా బన్నీ కెరీర్ ను ఎలా మలుపు తిప్పింది అన్నది ఎవరో చెప్పడం కాదు ఇటీవలే పుష్ప సక్సెస్ మీట్ లో అల్లు అర్జున్ చెబుతూ కన్నీళ్లు కూడా పెట్టుకోవడం చూసాం. ఇలా అల్లు అర్జున్ కెరీర్లో ఆర్య సినిమా, సుకుమార్ ఎంత కీలక పాత్ర వహించారు అల్లు అర్జున్ మాటల్లోనే ఇటీవలే ప్రేక్షకుల తెలుసుకున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి