నందమూరి బాలకృష్ణ యంగ్ హీరోలతో పోటీ పడుతూ దూసుకుపోతున్నారు. ఆయన ఏజ్ పెరుగుతున్నా కొద్ది ఎనర్జీ కూడా అంతే పెరుగుతుంది. వరస ప్రాజెక్టులతో బిజీగా మారడు బాలకృష్ణ. ఇక ప్రస్తుతం బుల్లి తెరపై కూడా సక్సెపుల్ గా అన్ స్టాపబుల్ షోను రన్ చేస్తున్నారు. స్టార్.. సూపర్ స్టార్ లను గెస్ట్ లతో ఓ ఆట ఆడుకుంటూ.. ఆడిస్తూ..షోను సూపర్ సక్సెస్ చేసేస్తున్నారు బాలయ్య. అయితే ఇప్పటివరకు బాలకృష్ణ హోస్ట్గా చేస్తున్న అన్ స్టాపబుల్ షోకు చాల మంది గెస్ట్ లు వచ్చారు. బాలయ్య మంచు ఫ్యామిలీతో స్టార్ట్ చేసిన ఈ షో.. నానీ, అఖండా టీమ్, రాజమౌళి, పుష్ప టీమ్, రవితేజ,మహేష్ బాబు, రానా, ఇలా స్టార్స్ అందరినీ పలకరిస్తూ  వస్తున్న బాలయ్యబాబు.. 

అందరితో తనదైన మార్క్ స్టైల్ కామెడీతో... ప్రశ్నలతో.. అలరిస్తూ.. ఆడియన్స్ తెగ ఆకట్టుకుంటున్నారు.బాలయ్య  వెండితెరపైనే కాదు.. బుల్లి తెరపై కూడా సింహం సింహమే అన్నట్టు దూసుకుపోతున్నరు . ఇకపోతే బాలయ్య ఈ సంక్రాంతికి లైగర్ టీమ్ తో Unstoppable అనిపించాడు. బాలయ్య షోలో లైజర్ చిత్ర బృందంతో తెగ సందడి చేశాడు. లైగర్ టీం లో భాగంగా యంగ్ స్టార్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ తో పాటు స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, ఛార్మీ కూడా ఈ షోలో సందడి చేశారు.  ఇక బాలయ్య వీరి ముగ్గురిని ప్రశ్నలతో ముంచేశాడు. షోలో వీరందరూ కలిసి బాగా సందడి చేశారు. 

ఇకపోతే డైరెక్టర్ కోరిక మేరకు బాలయ్య తాను మద్యం తాగేప్పుడు పాడే పద్యాన్ని గుక్క తిప్పుకోకుండా పాడి వినిపించాడు.  ప్రస్తుతం ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇకపోతే బాలయ్య సంక్రాంతి కానుకగా పంచ తో అందరికీ కనిపించాడు.ఇక విజయ్ దేవరకొండ స్టైలిష్ లుక్ లో మెరిసిపోతున్నారు. బాలయ్య మరియు విజయ్ దేవరకొండ ఇద్దరు కలిసి కనిపించడంతో ఈ షోకి పాపులారిటీ మరింత పెరిగిపోయింది . అంతేకాకుండా బాలయ్య విజయ్ దేవరకొండ ఇద్దరూ కలిసి స్టేజ్ మీద బాక్సింగ్ కూడా చేయడం జరిగింది . బాలయ్య బాక్సింగ్ చూసి విజయ్ దేవరకొండ సైతం షాక్ అయ్యాడు . ఇకపోతే పూరి జగన్నాథ్ కు బాలయ్య అంటే ఎంత ఇష్టమో మనందరికీ తెలిసిన విషయమే అయితే పూరి జగన్నాథ్ బాలకృష్ణ తో కలిసి ఈ షోలో ప్రతి మూమెంట్ ను ఎంజాయ్ చేశాడు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: