ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా ట్రైలర్ ఈ నెల 27వ తేదీన హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో రిలీజ్ చేయనున్నారు... ఇందుకు ముఖ్యఅతిథులుగా స్టార్ హీరోయిన్ అయిన సాయి పల్లవి- అలాగే కీర్తి సురేష్ హాజరవుతున్నారని చిత్రబృందం తెలియజేస్తున్నారు. అయితే ఈ సినిమా వాస్తవానికి మహిళల గొప్పతనాన్ని ఉద్దేశించి చిత్రీకరించడం జరిగింది. ఇక ట్రైలర్ ను విడుదల చేయడానికి ఈ ఇద్దరు హీరోయిన్లు ముఖ్య అతిథులుగా హాజరు కావడానికి ముఖ్యకారణం సినిమా కోసమే అన్నట్టుగా తెలియజేస్తూ. డైరెక్టర్ ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా రాశారని.. ఇక అంతే కాకుండా పాటలు కూడా దేవిశ్రీప్రసాద్ బాగా సమకూర్చగా.. ఈ సినిమాకి సుజిత్ సారంగ్ సినిమాటోగ్రఫీ గా పనిచేశారు.
ఇక ఈ సినిమాకి ఎన్నో జాతీయ అవార్డులు అందుకున్న శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ గా పని చేయడం జరిగింది. ఇక ఇందులో ముఖ్యంగా అలనాటి హీరోయిన్లు ఊర్వశి, రాధిక, ఖుష్బూ తదితర హీరోయిన్లు నటిస్తుండటం గమనార్హం. అయితే ఈ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కు ప్రత్యేకించి హీరోయిన్ కీర్తి సురేష్, సాయి పల్లవి ని ఎంపిక చేయడం వెనుక అసలు కారణం ఏమిటా అని తెలుసు కోవడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు.. అయితే ఇది కేవలం ఆడవాళ్లు మీకు జోహార్లు అన్న టైటిల్ కారణంగానే ఇద్దరికీ అర్హత ఉందని భావించి వీరిని పిలిచి ఉండొచ్చని సమాచారం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి