ఇప్పటికే అనేకసార్లు విడుదల వాయిదా పడినా ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు అన్నవిషయం ఈమూవీ ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్ టిక్కెట్ల మ్యానియా చూసిన వారికి అర్థం అవుతుంది. ఈమూవీ విడుదల కావడానికి ఇంకా రెండు వారాల సమయం ఉన్నప్పటికీ అప్పుడే ఈమూవీ అడ్వాన్స్ బుకింగ్ టిక్కెట్ల కలక్షన్స్ ఒక మిలియన్ దాటింది అంటే ఎవరైనా షాక్ అవుతారు.



కొనసాగుతున్న ఈమ్యానియా పరిశీలిస్తే ఈమూవీ ఓవర్సీస్ లో 10 మిలియన్ డాలర్లు కలెక్ట్ చేయడం చాల సులువు అన్న సంకేతాలు వస్తున్నాయి. రాజమౌళి ఈమూవీ మ్యానియాను మరింత మన తెలుగు రాష్ట్రాలలో పెంచడానికి ఈమూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను అత్యంత ఘనంగా వచ్చే వారం భాగ్యనగరంలో నిర్వహిస్తాడు అన్న లీకులు వస్తున్నాయి.



ఈమూవీలో చరణ్ జూనియర్ లు నటించడంతో వీరి కుటుంబాలకు చెందిన గాడ్ ఫాదర్స్ చిరంజీవి బాలకృష్ణ లను అతిధులుగా పిలిచి నందమూరి మెగా అభిమానులకు జోష్ ను ఇవ్వడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎప్పటి నుండో చిరంజీవి బాలకృష్ణ లను ఒకే వేదిక పై చూడాలని చాలామంది కలలు కంటున్నారు. ఇప్పుడు ఆ కల ‘ఆర్ ఆర్ ఆర్’ ఫంక్షన్ ద్వారా తీరుతుందా అన్న అంచనాలు వస్తున్నాయి. అయితే బాలకృష్ణ విషయంలో మాత్రం కొన్ని సందేహాలు ఉన్నాయి అంటున్నారు.



ఇప్పటికీ బాలయ్య జూనియర్ ల మధ్య ఏర్పడిన గ్యాప్ అదేవిధంగా ఉంది అని అంటారు. దీనికితోడు బాలయ్య చిరంజీవిల మధ్య కూడ చెప్పుకోతగ్గ సఖ్యత లేదు. దీనితో రాజమౌళి ప్రయత్నాలకు ఎంతవరకు బాలకృష్ణ సహకరిస్తాడు అన్న విషయం పై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఈమూవీకి కొనసాగుతున్న క్రేజ్ ను పరిశీలించిన ఇండస్ట్రీ వర్గాలు ఈమూవీ విడుదలైన మొదటివారంలోనే 300 కోట్ల కలక్షన్స్ మార్క్ ను అందుకుంటుంది అని అంటున్నారు. అదే జరిగితే ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మరొక సరికొత్త రికార్డ్ క్రియేట్ అవుతుంది అనుకోవాలి..



మరింత సమాచారం తెలుసుకోండి: