ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్, బ్యూటిఫుల్ హీరోయిన్ కృతి శెట్టి కలిసి నటిస్తున్న చిత్రం ది వారియర్.. ఈ చిత్రాన్ని తమిళ డైరెక్టర్ అయిన లింగస్వామి తెరకెక్కించడం జరుగుతుంది. ఈ సినిమాని అత్యధిక భారీ బడ్జెట్ తో నే యాక్షన్ సినిమాగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో హీరో రామ్ లుక్ మరియు అప్పియరెన్స్ బ్యాక్గ్రౌండ్ అన్నీ కూడా ఈ సినిమాపై హైప్ పెంచేలా కనిపిస్తున్నాయి. ఇక ఈ సినిమా ప్రారంభం అయి ఎన్నో నెలలు కావస్తున్నప్పటికీ ఇప్పటివరకు విడుదల తేదీ కూడా ప్రకటించలేదు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి విడుదల తేదీని ప్రకటించడం జరిగింది వాటి గురించి చూద్దాం..

చిత్ర బృందం నిన్నటి రోజున ది వారియర్ సినిమా గురించి ఈ రోజున ఒక అప్డేట్ వస్తుందని తెలియజేశారు. దీంతో నిన్నటి రోజు నుంచి హీరో రామ్ అభిమానులు చాలామంది ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే అనుకున్నట్టుగానే ఆ సినిమా సర్ప్రైజ్ విడుదల చేశారు చిత్ర బృందం. అయితే అదేమిటంటే విడుదల తేదీ విషయాన్ని అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఈ సమ్మర్ లో పెద్ద, చిన్న సినిమాలు భారీగానే విడుదలవుతున్నాయి. ఇక ది వారియర్ చిత్రాన్ని జూలై 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టుగా అధికారికంగా ప్రకటించడం జరిగింది.తెలుగులో పాటు తమిళంలో కూడా ఈ సినిమాను ఒకేసారి విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు కూడా చివరి దశకు చేరుకున్నట్లు గా సమాచారం. అయితే రవితేజ నటిస్తున్న రామారావు ఆన్ డ్యూటీ సినిమా కూడా జూలై నెలలోనే విడుదలకు సిద్ధంగా ఉన్నట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే ఆ చిత్రం జూలై 17 వ తారీకు న విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక కేవలం ఈ రెండు సినిమాలు విడుదల అయ్యే కి మూడు రోజుల గ్యాప్ తో నే విడుదల అవుతాయని చెప్పవచ్చు. మరి ఏ సినిమా ఎలా ఉంటుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: