ఇక అక్కినేని అఖిల్ హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తరువాత సక్సెస్ కోసం చాలా పరితపించారు. కానీ ఆయన నటించిన సినిమాలన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఏవరేజ్ గా ఆడాయి. ఎట్టకేలకు తన నాల్గో సినిమా అయిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్'తో ఓ మోస్తారు హిట్ అందుకున్నాడు.ఇక ఈ సినిమా మంచి వసూళ్లను కూడా రాబట్టింది. ఇంతకాలానికి హిట్ దక్కడంతో దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నంలో పడ్డాడు ఈ యంగ్ అండ్ స్మార్ట్ హీరో.తన కొత్త సినిమా అయిన 'ఏజెంట్'తో మాస్ హిట్ అందుకోవాలని అఖిల్ చూస్తున్నాడు. వక్కంతం వంశీ అందించిన కథతో స్టైలిష్ దర్శకుడుగా పేరున్న సురేందర్ రెడ్డి ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. ఇందులో అఖిల్ ఓ సీక్రెట్ ఏజెంట్ పాత్రలో కనిపించనున్నాడు. దానికి తగ్గట్లే కొత్త లుక్ లో కూడా కనిపించబోతున్నారు. ఇక ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఈ సినిమా టీజర్ ను కూడా రిలీజ్ చేశారు. ఈ టీజర్ అక్కినేని ఫ్యాన్స్ కి పెద్ద ఐఫీస్ట్ అనే చెప్పాలి. ఆ రేంజ్ లో ఉంది ఈ టీజర్. 'ది మోస్ట్ నోటోరియస్.. మోస్ట్ రూత్ లెస్ పేట్రియాట్' అనే డైలాగ్ తో ఇక ఈ టీజర్ మొదలైంది. ఈ పదాలతో అఖిల్ క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో సినిమాలో చెప్పేశారు.


ఫుల్ యాక్షన్ సీన్స్ తో ఈ టీజర్ ని ఫుల్ గా నింపేశారు.ఇంకా హై వోల్టేజ్ స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ను ఆగస్టు 12 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు ఇదివరకు అనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడు వాయిదా పడుతుందని సమాచారం. ఇక ఎ.కె.ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై అనీల్ సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ స్పై థ్రిల్లర్‌లో అఖిల్ కి జోడీగా సాక్షి వైద్య నటిస్తుంది. అలాగే ఈ సినిమాలో మలయాళ స్టార్ నటుడు మమ్ముట్టి కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇక పాన్ ఇండియా లెవెల్ లో సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. ఈ పాన్ ఇండియా చిత్రానికి హిప్ హాప్ తమిజా సంగీతం అందించగా ఇంకా రసూల్ ఎల్లోర్ ఛాయాగ్రహకుడిగా పని చేస్తున్నారు. నవీన్ నూలి ఎడిటర్‌గా అలాగే అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.ఈ సినిమాతో పెద్ద పాన్ ఇండియా హిట్ అందుకోని అఖిల్ స్టార్ హీరోగా మారాలని ఫిక్స్ అయ్యాడు. మరి చూడాలి ఈ సినిమాతో అఖిల్ ఎలాంటి హిట్ అందుకుంటాడో.

మరింత సమాచారం తెలుసుకోండి: