ఈటీవీ లో ప్రసారమయ్యే కామెడీ షో జబర్దస్త్ బుల్లితెరపై ఎంత గుర్తింపు సంపాదించుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దాదాపు తొమ్మిదేళ్ల నుంచి నిర్విరామంగా అటు ప్రేక్షకులందరినీ ప్రతివారం అలరిస్తూ వినూత్నమైన ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు అని చెప్పాలి. అయితే ఒకప్పుడు జబర్దస్త్ లో లేడీ కమెడియన్స్  ఉండేవారే కాదు. కానీ ఇటీవల కాలంలో మాత్రం ఎంతో మంది లేడీ  కమెడియన్స్ జబర్దస్త్ లో కనిపిస్తున్నారు అన్న విషయం తెలిసిందే. ఒక రకంగా చెప్పాలంటే జబర్దస్త్ లో ప్రస్తుతం ఫీమేల్ కంటెస్టెంట్స్ హవా ఎక్కువగా నడుస్తూ ఉంది.


 ఇలా జబర్దస్త్ ద్వారా ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న కమెడియన్స్ లో వర్షా కూడా ఒకరు అని చెప్పాలి. ముఖ్యంగా ఇమాన్యుల్ తో లవ్ స్టోరీ  కారణంగా వర్ష అందరి దృష్టిలో పడింది   ఇక ఎన్నో రోజుల పాటు ఈటీవీలో పలు కార్యక్రమాలకు ఆమె లవ్ స్టోరీ కంటెంట్ గా మారిపోయింది అని చెప్పాలి. ఇటీవల కాలంలో ఎంతో మంది కమెడియన్స్  పై బాడీ షేమింగ్ చేస్తూ ఎక్కువగా కౌంటర్లు వేయడం లాంటివి జబర్దస్త్ లో కనిపిస్తూ ఉంటాయి.


 రోహిణి లావుగా ఉందని వర్ష అసలు అమ్మాయి లాగే లేదు అంటూ దారుణంగా కామెంట్లు చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. అంతేకాదు వర్షా లేడీ గెటప్ అంటూ దారుణంగా కామెంట్ చేయడం కూడా చూస్తూ ఉంటాము. అయితే ఇటీవలే వర్ష గురించి బుల్లెట్ భాస్కర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. అందరూ హీరోయిన్స్ లాగానే వర్ష కూడా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది అని చెప్పుకొచ్చాడు.  జబర్దస్త్ లో వారి జీవితాల మీద జరిగిన సంఘటనల ఆధారంగా స్కిట్ చేయగా వర్ష ప్లాస్టిక్ సర్జరీ గురించి బుల్లెట్ భాస్కర్ వరుసగా కౌంటర్లు వేశాడు. మన ఖజానా ఎలా ఉంది అని వర్ష అడగగా.. మీ ప్లాస్టిక్ సర్జరీ లతో మొత్తం ఖాళీ అయింది అంటూ కౌంటర్ వేశాడు. దీంతో వర్ష నిజంగానే ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందని అందరు అనుకోవడం  మొదలు పెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: