ఇక ఇండియన్ మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్ మరియు సురేశ్ రైనా మూవీ క్రిటిక్స్ అవతారం ఎత్తారు. థియేటర్ కి వెళ్ళిన ఈ స్టార్ క్రికెటర్స్ ఇద్దరూ కూడా రీసెంట్ గా వచ్చిన అమీర్ ఖాన్ లాల్ సింగ్ చడ్డా మూవీని చూశారు. చూసి వారు ఊరుకోలేదు. ఇక ఈ సినిమాకు తమ రివ్యూ కూడా ఇచ్చారు. అద్వైత్ చందన్ డైరెక్ట్ చేసిన ఈమూవీలో కరీనా కపూర్ ఖాన్ అమీర్ ఖాన్ కు జోడీగా నటించింది.ఈ సినిమాలో అమీర్ ఖాన్ నటన ఇంకా అలాగే ఈ సినిమా కథ, స్క్రీన్ ప్లేను ప్రశంసిస్తూ, వీరేంద్ర సెహ్వాగ్ పోస్ట్ పెట్టారు. అంతేగాక ఈ సినిమా కామన్ ఇండియన్ ఎమోషన్స్ ను కంప్లీట్ గా క్యాప్చర్ చేసిందన్నారు. భారతదేశంలోని మధ్య తరగతి ప్రజల భావోద్వేగాలను చాలా అద్భుతంగా చూపించారన్నారు. ఇక ఇది అమీర్ ఖాన్ సినిమా కాబట్టి నటన గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అని కూడా అన్నారు సెహ్వాగ్.ఇక అంతే కాదు ఈ సినిమాలోని ఇతర పాత్రల గురించి కూడా వీరేంద్ర సెహ్వాగ్ మాట్లాడారు. ఈ సినిమాలో అమీర్ ఖాన్ తో పాటు ప్రతీ ఒక్కరూ కూడా అద్భుతంగా నటించారు, అంతే కాదు ప్రతీ ఒక్క టెక్నీషన్ కూడా మనసు పెట్టిపనిచేశారన్నారు. ఇక సెంటిమెంట్‌ను ప్రతిధ్వనిస్తూ, లాల్ సింగ్ చడ్డాసినిమా బృందం చేసిన కృషి మరియు ప్రయత్నాల పట్ల తాను పూర్తిగా విస్మయం చెందుతున్నానని సురేష్ రైనా అన్నాడు. 


అన్నింటికీ మించి సినిమాలో మరో గొప్పదనం కూడా ఉందన్నారు. అదే ఈ సినిమా ప్రేమకథ ఇంకా అందమైన పాటలు అంటూ రైనా అభిప్రాయ పడ్డారు. ఈ సినిమాలో లవ్ ట్రాక్ తో పాటు అద్భుతమైన పాటలను కూడా సురేష్ రైనా ఎంజాయ్ చేశారట.ఇక ఈ స్టార్ క్రికెటర్లిద్దరు రివ్యూ చెపుతున్న వీడియోను అమీర్ ఖాన్ ప్రొడక్షన్ హౌస్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. లాల్ సింగ్ చడ్డా సినిమా చూసిన తర్వాత వీరేంద్ర సెహ్వాగ్ ఇంకా సురేష్ రైనా స్పందన అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు. ఈ సినిమాలో అమీర్ ఖాన్ తో పాటు టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య కూడా ఇంపార్టెంట్ రోల్ చేశారు. ఈ సినిమాతో ఆయన బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు.ఇక హాలీవుడ్ క్లాసిక్ మూవీ ఫారెస్ట్ గంప్‌కి హిందీ రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది. ఈ మూవీని అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ ఇంకా వయాకామ్ 18 సంయుక్తంగా నిర్మించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: