టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఏర్పరచుకున్న నితిన్ ఇప్పటికే ఎన్నో విజయవంత మైన మూవీ లలో నటించిన విషయం మన అందరికీ తెలిసిందే . నితిన్ ఆఖరుగా నటించిన ఆరు సినిమాలు మొదటి రోజు సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం .

నితిన్ తాజాగా మాచర్ల నియోజకవర్గం మూవీలో హీరోగా నటించాడు. ఈ మూవీకి ఎన్ ఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించగా , క్యాథరిన్, కృతి శెట్టి ఈ మూవీ లో హీరోయిన్ లుగా నటించారు. ఈ మూవీ నిన్న అనగా ఆగస్ట్ 12 వ తేదీన థియేటర్ లలో విడుదల అయ్యింది. ఈ మూవీ మొదటి రోజు 4.62 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. నితిన్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా తెరకెక్కిన రంగ్ దే మూవీ మొదటి రోజు 4.62 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. నితిన్ హీరోగా తెరకెక్కిన చెక్ మూవీ మొదటి రోజు 3.38 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.


నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్ గా తెరకెక్కిన భీష్మ సినిమా మొదటి రోజు 6.42 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. నితిన్ హీరోగా తెరకెక్కిన శ్రీనివాస కళ్యాణం సినిమా మొదటి రోజు 2.82 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. నితిన్ హీరోగా తెరకెక్కిన చల్ మోహన్ రంగ మూవీ మొదటి రోజు 2.59 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. నితిన్ 'మాచర్ల నియోజకవర్గం' మూవీ కంటే ముందు మాస్ట్రో మూవీ తో ప్రేక్షకులను పలకరించినప్పటికి మాస్ట్రో మూవీ థియేటర్ లలో కాకుండా నేరుగా 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లో విడుదల అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి: