నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్స్ లో చందు మొండేటి డైరక్షన్ లో వచ్చిన సినిమా కార్తికేయ 2. తెలుగుతో పాటుగా హిందీలో కూడా రిలీజైన ఈ సినిమా అక్కడ ఓ రేంజ్ లో రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. మొదటిరోజు కేవలం 50 థియేటర్స్ లో రిలీజైన కార్తికేయ 2 ఐదవర రోజుకి 1500 థియేటర్లలో ఆడుతుంది. నిఖిల్, చందు ల ఎఫర్ట్ కి తగిన ఫలితం దక్కిందని చెప్పొచ్చు. ఈ సినిమా తెలుగు రిలీజ్ పై నిఖిల్ చాలా ఎమోషనల్ అయ్యాడు. థియేటర్లు దొరకట్లేదని బాధపడ్డాడు.

అయితే తెలుగులో కూడా ఈ సినిమా సూపర్ హిట్ కలక్షన్స్ తో దూసుకెళ్తుండగా బాలీవుడ్ లో మాత్రం కార్తికేయ 2 స్వాగ్ నడుస్తుంది. సినిమా బాలీవుడ్ ఆడియెన్స్ కి బాగా కనెక్ట్ అయ్యింది. ఇక పాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ అందుకున్న కార్తికేయ 2 సినిమాని ఇంకాస్త ప్రమోట్ చేస్తూ సినిమా సక్సెస్ కి కంగ్రాట్స్ చెప్పాడు మన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. గా కార్తికేయ 2 సక్సెస్ అయినందుకు ప్రభాస్ హీరో నిఖిల్, హీరోయిన్ అనుపమ తో పాటుగా డైరక్టర్ చందు మొండేటికి చిత్రయూనిట్ అందరికి కంగ్రాట్స్ అంటూ తన సొషల్ మీడియాలో కామెంట్ పెట్టాడు.

ప్రభాస్ కామెంట్ తో పాన్ ఇండియా రేంజ్ లో ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్ కూడా కార్తికేయ 2 మీద స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కార్తికేయ 2 హిందీ వర్షన్ రోజు రోజుకి బీభత్సమైన క్రేజ్ తెచ్చుకుంటుంది. ఆగష్టు 19 కృష్ణాట్ష్టమి ఉంది కాబట్టి సినిమాలో కూడా కృష్ణుడి తత్వం ఉంది కాబట్టి కార్తికేయ 2 మరో నాలుగైదు రోజులు కుదురితే వారం రోజులు హిందీలో రచ్చ రంబోలా చేసే అవకాశం ఉంటుంది. చూస్తుంటే అక్కడ 100 కోట్లు కలెక్ట్ చేసినా చెయొచ్చని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: