ప్రభాస్ హీరోగా ఇప్పుడు పలు సినిమాలు రూపొందుతున్నాయి. వాటిలో ముందుగా ప్రేక్షకుల ముందుకు ఆది పురుష్ చిత్రం రాబోతుంది. బాలీవుడ్ లో భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రంలో కృతి సనన్ హీరోయిన్ గా నటించగా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమాను విడుదల చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది. రామాయణం ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తూ ఉండడం ఈ చిత్రం పట్ల భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడడానికి ముఖ్య కారణం.

బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ హీరోగా నటించిన రెండు చిత్రాలు కూడా ప్రేక్షకులను నిరాశపరచడంతో ఈ సారి రాబోయే చిత్రం తప్పకుండా భారీ విజయాన్ని అందుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అభిమానులు కూడా ఇవే కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాపై ఎంతగానో అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు. వాస్తవానికి ఈ సినిమా కంటే ముందుగానే ప్రేక్షకుల ముందుకు ప్రభాస్ హీరోగా నటించిన సలార్ చిత్రం రావాల్సి ఉంది. కానీ కారణం ఏంటో తెలియదు కానీ ఆ సినిమా షూటింగ్ ఆలస్యం అయిన కారణంగా విడుదల జరగడం లేదు.

ప్రస్తుతానికైతే ఈ సినిమాను వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయాలని చూస్తున్నారని అంటున్నారు. ఇక కొంతమంది ఈ సినిమాను వచ్చే ఏడాది సెప్టెంబర్ లో కూడా విడుదల చేయాలని ఆలోచిస్తున్నారని చెబుతున్నారు. దీంతో భారీ యాక్షన్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ సినిమాను చూడడానికి మరికొన్ని రోజులు వేచి చూడాల్సి వస్తుంది అన్న అసహనం అభిమానులలో కనిపిస్తుంది. కేజిఎఫ్ సినిమా తర్వాత ప్రశాంత నీల్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేస్తున్న ఈ సినిమా ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి. శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ ద్విపాత్రాభినయంలో కనిపించబోతున్నాడని చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: