మలయాళ ఇండస్ట్రీ లో అదిరి పోయే క్రేజ్ ఉన్న నటులలో ఒకరు అయినా ఫాహాద్ ఫజిల్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఫాహాద్ ఫజిల్ ఇప్పటికే మలయాళ సినిమా ఇండస్ట్రీ లో ఎన్నో విజయవంత మైన మూవీ లలో నటించి మలయాళ సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరో లలో 0కరిగా కొనసాగు తున్నాడు . ఇది ఇలా ఉంటే పోయిన సంవత్సరం విడుదల అయిన పుష్ప ది రైస్ అనే తెలుగు మూవీ లో ఫాహాద్ ఫజిల్ ప్రతి నాయకుడి పాత్రలో నటించాడు.

మూవీ అద్భుతమైన విజయం సాధించడం మాత్రమే కాకుండా ఈ మూవీ లో ఫాహాద్ ఫజిల్ నటనకు కూడా ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది.  ఇది ఇలా ఉంటే ఇప్పటికే తాను నటించిన మూవీ ల ద్వారా ఇండియా వ్యాప్తంగా అదిరి పోయే క్రేజ్ ని సంపాదించుకున్న ఫాహాద్ ఫజిల్ తాజాగా తన కొత్త మూవీ ని ప్రారంభించాడు. ఫాహాద్ ఫజిల్ తన కొత్త మూవీ కే జీ ఎఫ్ మూవీ కి ప్రొడ్యూసర్ లుగా వ్యవహరించిన హోంబల్ ఫిలిమ్స్ బ్యానర్ లో నటించ బోతున్నాడు.

మూవీ లో ఫాహాద్ ఫజిల్ సరసన అనుపమ బలమురళి హీరోయిన్ గా నటించనుంది. పవన్ కుమార్మూవీ కి దర్శకత్వం వహించ నున్నాడు. అలాగే ఈ మూవీ కి ధూమం అనే టైటిల్ ని మూవీ యూనిట్ కరారు చేసింది. ఈ మూవీ ని సౌత్ లోని అన్ని భాషలలో విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది. ఇలా కే జి ఎఫ్ లాంటి భారీ పాన్ ఇండియా మూవీ ని నిర్మించిన హోంబల్ ఫిలిమ్స్ బ్యానర్ లో తన తదుపరి మూవీ ని చేయనున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: