బాలీవుడ్ పరిస్థితి చాలా దారుణంగా తయారు అయ్యింది. బాయ్ కాట్ బాలీవుడ్ సమస్య వాళ్ళని బాగా పట్టి పీడిస్తుంది.ఇక ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్‌గా కొన్నేళ్ల ముందు వరకు నీరాజనాలు అందుకున్న ఆమిర్ ఖాన్.. ఇటీవల 'లాల్ సింగ్ చడ్డా'తో ఎంత దారుణమైన అనుభవాన్ని ఎదుర్కొన్నాడో తెలిసిందే. దానికి ముందు, తర్వాత కూడా కొన్ని పెద్ద సినిమాలకు ఇలాంటి అనుభవమే ఎదురైంది.ఐతే ఇటీవల 'బ్రహ్మాస్త్ర' సినిమాకు భారీ ఓపెనింగ్స్ రావడం.. ఆ సినిమా కొన్ని వారాల పాటు సత్తా చాటడంతో పరిస్థితి మెరుగుపడిందని అనుకున్నారంతా. కానీ ఇప్పుడు ఇంకో పెద్ద సినిమాకు బాక్సాఫీస్ దగ్గర చేదు అనుభవం తప్పలేదు. ఆ సినిమానే... విక్రమ్ వేద.బాలీవుడ్ లో ఎప్పుడు నుంచో సత్తా చాటుతున్న బిగ్గెస్ట్ స్టార్ హీరోస్ హృతిక్ రోషన్, సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రలు పోషించిన 'విక్రమ్ వేద'.. ఇదే పేరుతో తమిళంలో విడుదలై బ్లాక్‌బస్టర్ అయిన సినిమాకు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఒరిజినల్ డైరెక్టర్లు పుష్కర్, గాయత్రిలే హిందీలోనూ రీమేక్ చేశారు. ఈ సినిమాకు హిందీలోనూ మంచి టాక్ వచ్చింది.


పెద్ద స్టార్ కాస్ట్, పాజిటివ్ టాక్.. ఒక సినిమా మంచి వసూళ్లు రాబట్టడానికి ఇంతకంటే ఏం కావాలి? కానీ తొలి రోజే రూ.10 కోట్ల వసూళ్లతో తీవ్రంగా నిరాశ పరిచిన 'విక్రమ్ వేద' తర్వాతి రెండు రోజుల్లోనూ పెద్దగా పుంజుకోలేకపోయింది.వీకెండ్ అయ్యేసరికి మొత్తం వసూళ్లు రూ.36 కోట్లకు అటు ఇటుగా ఉన్నాయి. ఇక సోమవారం అయితే వసూళ్లు ఒక్కసారిగా డ్రాప్ అయ్యాయి. కేవలం దేశవ్యాప్తంగా రూ.4 కోట్లు రాబట్టిందీ చిత్రం. రూ.250 కోట్ల భారీ బడ్జెట్లో తెరకెక్కిన సినిమాకు తొలి నాలుగు రోజుల్లో రూ.50 కోట్ల వసూళ్లు కూడా రాకపోవడం దారుణం. హృతిక్ లాంటి పెద్ద స్టార్ నటించి, పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సినిమాకు ఈ దుస్థితి వస్తుందని ఎవ్వరూ ఊహించి ఉండరు.మరి చూడాలి లాంగ్ రన్ లో ఈ మూవీ సేఫ్ అవుతుందో లేదో..అసలు ఎన్ని కోట్ల వసూళ్లు రాబడుతుందో..

మరింత సమాచారం తెలుసుకోండి: