టాలీవుడ్  సీనియర్  స్టార్  హీరో కింగ్  అక్కినేని నాగార్జున నటించిన లేటెస్ట్ హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ''ది ఘోస్ట్'' దసరా పండుగ సందర్భంగా థియేటర్లలోకి వచ్చింది.టాలీవుడ్  యంగ్  & టాలెంటెడ్ డైరెక్టర్  ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకి యావరేజ్ టాక్ వచ్చింది. దీనికి తగ్గట్టుగానే ఓపెనింగ్ డే కలెక్షన్స్ దారుణంగా ఉన్నాయి.తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా 'ది ఘోస్ట్' మూవీకి మొదటి రోజు చాలా తక్కువ స్థాయిలో ఓపెనింగ్స్ వచ్చాయి. రెండో రోజు కూడా ఈ సినిమా పరిస్థితి అలానే ఉంది. లాంగ్ వీకెండ్ ని క్యాష్ చేసుకోవచ్చు అనుకున్న మేకర్స్ కు నిరాశ తప్పేటట్లు లేదు.నిజానికి ఒకప్పుడు అసలు రిజల్ట్ తో సంబంధం లేకుండా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన కింగ్  నాగ్.. అసలు  గత కొంతకాలంగా పెద్దగా ప్రభావం చూపించలేకపోతున్నారు. ప్లాప్స్ సంగతి పక్కన పెడితే.. హిట్ టాక్ తెచ్చుకున్న సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద పెద్దగా కలెక్షన్స్ రాబట్టలేకపోవడం గమనార్హం.'సోగ్గాడే చిన్ని నాయనా' 'ఊపిరి' సినిమాల తర్వాత నాగార్జున నుంచి ఆ రేంజ్ లో వసూళ్ళు సాధించిన చిత్రం అసలు ఇంకా రాలేదనే చెప్పాలి. 'ఆఫీసర్' 'మన్మథుడు 2' 'వైల్డ్ డాగ్' వంటి చిత్రాలు ప్లాప్స్ గా నిలిచాయి.


ఇప్పుడు 'ది ఘోస్ట్' ఓపెనింగ్స్ చూస్తుంటే.. 'బంగార్రాజు' ఓపెనింగ్స్ కూడా అయన పెద్ద తనయుడు నాగచైతన్య వల్లనే వచ్చాయనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.నాగార్జున 'ది ఘోస్ట్' సినిమాతో పాటుగా ఆయన సమకాలీకుడు మెగాస్టార్ చిరంజీవి నటించిన 'గాడ్ ఫాదర్' చిత్రం కూడా విడుదలైంది. గత చిత్రాల స్థాయిలో కాకపోయినా చెప్పుకోదగ్గ ఓపెనింగ్స్ ను రాబట్టగలిగింది. మరో సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ సైతం గతేడాది 'అఖండ' సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నారు.కానీ నాగర్జున మాత్రం 'ది ఘోస్ట్' సినిమాతో కనీస వసూళ్ళు అందుకోలేకపోవడం ఫ్యాన్స్ ని ఆందోళనకు గురి చేస్తోంది.ఇక ఇలాగే అయితే నాగ్ ఇక హీరోగా కొనసాగడం కష్టమే అంటున్నారు. తన తోటి సీనియర్ హీరోలు అయిన బాల కృష్ణ, చిరంజీవి, కమల్ హాసన్, వెంకటేష్ ల లాగా నాగార్జునకి కూడా ఒక మంచి స్ట్రాంగ్  కం బ్యాక్  హిట్  అనేది  దక్కాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: