వరుస హిట్లతో టాలీవుడ్  టాప్ హీరోగా దూసుకుపోతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు రీసెంట్ గా నటించిన సర్కారు వారి పాట సినిమా ఈ ఏడాది సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. చాలా గ్యాప్ తర్వాత ఆ సినిమా థియేటర్లలోకి రావడంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ అయితే చాలా హడావిడి చేసి సినిమాను చూశారు. అందువల్ల రికార్డ్ ఓపెనింగ్స్ కూడా వచ్చాయి. మొదటి రోజే ఏకంగా 75 కోట్ల వసూళ్లు వచ్చాయి. కానీ ఇతర హీరోల అభిమానులు మహేష్ బాబు అంటే గిట్టని యాంటి ఫ్యాన్స్ అలాగే ఒక ప్రముఖ మీడియా సినిమా బాగాలేదంటూ సినిమా అట్టర్ ప్లాప్ అంటూ నెగటివ్ ప్రచారం చెయ్యడం సాగింది. అయినా కానీ సూపర్ స్టార్  క్రేజ్ వల్ల ఇన్ని అడ్డంకులు దాటి సినిమా ఏకంగా 215 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అయితే నష్టాలు రాకుండా బుయ్యర్స్ సేఫ్ అయ్యి లాభపడ్డారు. కానీ తాజాగా స్టార్ మా లో టెలికాస్ట్ అయిన ఈ మూవీకి షాకింగ్ టి ఆర్ పి రేటింగ్ అనేది వచ్చింది.


ఈ మూవీకి 9.45 టి ఆర్ పి రేటింగ్ రావడం అభిమానులకు నిరుత్సాహం కలిపించింది.ఇది మిగతా హీరోలకి అయితే ఎక్కువేనేమో కానీ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాకు మొదటిసారి ఇంత తక్కువ స్థాయిలో రేటింగ్ రావడం అనేది ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఒక విధంగా ఈ సినిమాకు ససూళ్లు సునామిలాగా వచ్చినా పెద్దగా టీవిలో మాత్రం అనుకున్న టి ఆర్ పి రేటింగ్ రాలేదు. దీంతో ఫ్యాన్స్ కొంచెం అసంతృప్తిగా వున్నారు. ప్రస్తుతం సూపర్ స్టార్  మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో  తన 28 వ సినిమా చేస్తున్నాడు. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా తరువాత మహేష్ బాబు ఫర్ ది ఫస్ట్ టైం రాజమౌళి దర్శకత్వంలో పాన్ వరల్డ్ మూవీ చేస్తున్నాడు. ఈ రెండు మూవీలపై సూపర్ స్టార్ మహేష్ అభిమానుల్లో ఎన్నో భారీ అంచనాలు వున్నాయి. మరి చూడాలి ఈ రెండు సినిమాలు ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తాయో.

మరింత సమాచారం తెలుసుకోండి: