మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం పరస పెట్టి మూవీ లలో నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ప్రస్తుతం చిరంజీవి ,  బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ లో కూడా హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ కి చిత్ర బృందం టైటిల్ ను ఇప్పటి వరకు ఫిక్స్ చేయలేదు. దానితో ఈ మూవీ చిరంజీవి కెరియర్ లో 154 మూవీ గా రూపొందుతూ ఉన్న నేపథ్యంలో ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం మెగా 154 అనే వర్కింగ్ టైటిల్ తో జరుగుతుంది. ఈ మూవీ టైటిల్ ను మరియు టీజర్ ను ఈ దీపావళి సందర్భంగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తాజాగా ప్రకటించింది.

నిన్ననే ఈ మూవీ కి సంబంధించిన డబ్బింగ్ పనులను కూడా మూవీ యూనిట్ ప్రారంభించింది. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ లో చిరంజీవి సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ,  మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ మూవీ ని నిర్మిస్తోంది. మాస్ మహారాజ రవితేజమూవీ లో కీలక పాత్రలో నటిస్తూ ఉండగా దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం మెగా 154 మూవీ లో మెగాస్టార్ చిరంజీవి మరియు మాస్ మహారాజా రవితేజ పాత్రలు ఇవే అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ...  మెగాస్టార్ చిరంజీవిమూవీ లో వాల్టేరు వీరయ్య పాత్రలో కనిపించబోతున్నట్టు ,  మాస్ మహారాజా రవితేజమూవీ లో వైజాగ్ రంగరాజు పాత్రలో కనిపించబోతున్నట్లు ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో అవుతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో వింటేజ్  చిరంజీవి కనిపించబోతున్నాడు అని చిత్ర బృందం ఇప్పటికే అనేక సార్లు చెప్పడంతో ఈ మూవీ పై మెగా అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: