టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి  గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా వున్నాడు మన మెగాస్టార్ చిరంజీవి. ఇదిలావుంటే ఇక  రీసెంట్ గా గాడ్ ఫాదర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.ఇక ఈ సినిమా  హిట్ అయినప్పటికీ మెగా ఫ్యాన్స్ ఆశించిన స్థాయిలో హిట్ అవ్వలేకపోయింది.అయితే  గాడ్ ఫాదర్ హిట్ సరిపోకపోడంతో ఇప్పుడు ఫ్యాన్ ఆశలన్నీ వాల్తేరు వీరయ్య పైనే పెట్టుకున్నారు. ఇదిలావుంటే ఈ సినిమా కు బాబీ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈ సినిమా లో మెగాస్టార్ తో పాటు

 మాస్ మహారాజా రవితేజ కూడా నటిస్తున్నారు. ఇకపోతే మాస్ మసాలా ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ కోసం మెగా అభిమానులంతా వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా లో హీరోయిన్ గా శ్రుతిహాసన్ నటిస్తోంది. ఇప్పటికే ఈ నుంచి విడుదలైన పోస్టర్లు, టైటిల్ టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.అంతేకాదు  అలాగే రీసెంట్ గా వచ్చిన బాస్ పార్టీ సాంగ్ ప్రేక్షకులను ఉర్రుతలూగిస్తుంది.ఇక ఇప్పటికే మిలియన్ కొద్దీ వ్యూస్ తో యూట్యూబ్ ను షేక్ చేస్తోంది ఈ సాంగ్. ఇదిలావుంటే ఇక తాజాగా ఈ కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అయితే ఈ సినిమా  లో చిరంజీవి , రవితేజ కాంబినేషన్లో వచ్చే కొన్ని సన్నివేశాలు నెక్స్ట్ లెవల్ లో ఉంటాయని తెలుస్తుంది. ఈ సినిమా లో మెగాస్టార్ చిరంజీవి సవతి తల్లి కొడుకుగా రవితేజ నటిస్తున్నాడని.. ఇద్దరికీ మధ్య పడదు అని టాక్ వినిపిస్తోంది.ఈ అన్న తమ్ముళ్ల మధ్య వచ్చే సీన్స్ కే హైలెట్ గా ఉండనున్నాయట.అంతేకాదు  ఇద్దరి మధ్య పోటీ ఎత్తుకు పై ఎత్తులు ప్రేక్షకులను ఆకట్టుకోనున్నాయని అంటున్నారు.అయితే  అలాగే ఈ ఇద్దరి మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ కూడా ప్రేక్షకులను కట్టిపడేస్తాయని అంటున్నారు. ఇకపోతే  త్వరలోనే వాల్తేరు వీరయ్య లో రవితేజ ఎలా ఉండబోతున్నాడు క్లారిటీ ఇవ్వబోతున్నారు. అయితే ఇక అలాగే ఈ ఇద్దరు కలిసి డాన్స్ చేసిన సాంగ్ ను కూడా రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: