తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సినిమా సినిమాకు తన క్రేజ్ ను పెంచుకుంటున్న వారిలో అడవి శేషు ఒకరు. కెరియర్ ప్రారంభం లో కొన్ని సినిమాల్లో అడవి శేషు నటించినప్పటికీ ఆ సినిమాలు ఏవి కూడా ఈ నటుడు కి పెద్దగా గుర్తింపు తెచ్చి పెట్టలేదు. క్షణం మూవీ తో సోలో గా సూపర్ హిట్ విజయాన్ని అందుకున్న అడవి శేషు ఆ తర్వాత నుండి నటించిన  ప్రతి మూవీ తోను బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాలను అందుకుంటూ తన క్రేజ్ ను సినిమాకి పెంచుకుంటూ వస్తున్నాడు. ఇది ఇలా ఉంటే అడవి శేష్ తాజాగా హిట్ ది సెకండ్ కేస్ అనే మూవీ లో హీరోగా నటించాడు.

మూవీ నిన్న థియేటర్ లలో విడుదల అయింది. ఈ మూవీ కి మొదటి రోజు అద్భుతమైన కలెక్షన్ లు బాక్స్ ఆఫీస్ దగ్గర లభించాయి. అడవి శేషు తన కెరియర్ లో ఆఖరుగా నటించిన నాలుగు మూవీ లు మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం. అడవి శేషు హీరోగా తెరకెక్కిన గూడచారి మూవీ మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 75 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది. అడవి శేషు హీరోగా తెరకెక్కిన ఎవరూ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో 1.68 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

మూవీ లో రెజీనా , నవీన్ చంద్ర కీలక పాత్రలో నటించారు. అడవి శేషు హీరో గా తెరకెక్కిన మేజర్ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు 4.07 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. అడవి శేషు హీరోగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన హిట్ ది సెకండ్ కేస్ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు 4.03 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: