టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సీనియర్ ప్రొడ్యూసర్ రామానాయుడు వారసులుగా ఇండస్ట్రీలోకి వచ్చిన సురేష్ బాబు మరియు వెంకటేష్ తమకంటూ ఒక మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. హీరో వెంకటేష్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. ఇక సురేష్ బాబు సినీ ఇండస్ట్రీలో ఉన్న అగ్ర నిర్మాతల్లో ఒకరిగా ఉన్నారు . ఇద్దరు తమ తమ కెరీర్ ను ఎంతో సక్సెస్ఫుల్గా కొనసాగిస్తున్నారు .అయితే ఎంతో అన్యోన్యంగా ఉండే సురేష్ బాబు మరియు వెంకటేష్ ల మధ్య ఎప్పుడు ఏదో ఒక గొడవలు ఉండనే ఉంటాయట .అయితే తాజాగా సురేష్ బాబు అన్ స్టాపబుల్ షో కి వచ్చిన సంగతి తెలిసిందే కదా... 

ఇక ఈ షోలో భాగంగా ఆయన మాట్లాడుతూ వెంకటేష్ కి నాకు ఫుడ్ విషయంలో ఎప్పుడు గొడవలు జరుగుతుంటాయని వెల్లడించారు. అంతేకాదు వీటితోపాటు వారికి సంబంధించిన వ్యక్తిగత విషయాలను కూడా చెప్పారు .అందులో భాగంగానే వారికి సంబంధించిన ఆస్తుల విషయాల గురించి ఆయన మాట్లాడుతూ ...ఇప్పటికీ మా ఇద్దరి ఆస్తి పంపకాలు ఇంకా జరగనే లేదు అని... అంతేకాదు ఒకవేళ నేను వెంకటేష్ తో సినిమా చేస్తే కనుక సగం రెమ్యూనరేషన్ మాత్రమే ఇస్తానని చెప్పడంతో ఇప్పుడు ఈ వార్త కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అంతేకాదు వెంకటేష్ నేను ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చినా ఏం మాట్లాడడు అని చెప్పడం జరిగింది .ఇక ఆయన హీరోగా సురేష్ బాబు బ్యానర్ లో అనేక సూపర్ హిట్ సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా వెంకటేష్ హీరోగా వచ్చిన పలు సినిమాలను సురేష్ బాబు నిర్మించడం జరిగింది. ఇక ఆ సినిమాలు కాస్త ఓటిటిలో రిలీజ్ చేసిన సమయంలో సురేష్ బాబు పై అనేకమైన విమర్శలు కూడా రావడం జరిగింది. ఏదేమైనా అవేమీ పట్టించుకోని సురేష్ బాబు తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు. అంతేకాకుండా ఈయనని అందరూ కమర్షియల్ ప్రొడ్యూసర్ అని కామెంట్లో చేసినప్పటికీ ఆయన తనకు ఆర్థికంగా బెనిఫిట్ ఉంటే మాత్రమే సినిమాలు చేస్తానని ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు .దీంతోపాటు వారి వ్యక్తిగత విషయాలు మరియు ఫ్యామిలీ విషయాల గురించి బాలకృష్ణతో పంచుకున్నాడు సురేష్ బాబు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: